టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ మంచి డిమాండ్ లో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న. దీపావళికి ‘తమ’తో ప్రేక్షకులను పలకరించనుంది. ఇదో హారర్ కామెడీ. ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు. స్త్రీ, స్త్రీ 2, ముంజ్యా లాంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన మాడక్ ఫిలిమ్స్ దీన్ని పెద్ద బడ్జెట్ తో నిర్మించింది. ముంబై టాక్ ప్రకారం ఇది డ్రాకులా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ. హీరోయిన్ పాత్రకు ఈ షేడ్ చాలా కీలకంగా ఉంటుందట. నవాజుద్దీన్ సిద్ధిక్ పాత్ర ఊహించనంత వయొలెంట్ గా ఉంటుందట. ఆయుష్మాన్ ఖురానాతో రష్మిక నడిపించే ప్రేమకథే ఇందులో కీలకం కానుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బోలెడు ఉంటాయట.
ఒకవేళ బాలీవుడ్ రిపోర్ట్స్ కనక నిజమయ్యే పక్షంలో రష్మిక డ్రాకులాగా కనిపించనుంది. అయితే దీనికి సహేతుకమైన లాజిక్స్, మేజిక్స్ చేసే ఉంటారు కాబట్టి ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పని లేదు. దీపావళికి విడుదల కాబోతున్న ఈ హారర్ డ్రామాలో కామెడీ మోతాదు తక్కువగానే ఉంటుందని సమాచారం. తమని ప్రధానంగా రష్మిక ఇమేజ్ మీద మార్కెట్ చేయబోతున్నారు. చావా నిర్మించిన మడాక్ సంస్థే ఇప్పుడీ తమకు ప్రొడ్యూసర్ కావడం వల్ల రెమ్యునరేషన్ పరంగా పెద్ద మొత్తమే అందిందని వినికిడి. హారర్ యునివర్స్ ని కలుపుతూ రెండేళ్ల తర్వాత అన్ని పాత్రలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
దీని సంగతలా ఉంచితే రష్మిక నుంచి నెక్స్ట్ రిలీజ్ కావాల్సిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ థ్రిల్లర్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర విపరీతమైన ఆలస్యానికి గురవుతోంది. గీత ఆర్ట్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ పార్ట్ నర్ గా ఉన్నప్పటికీ లేట్ కు గల కారణాలు బయటికి తెలియనివ్వడం లేదు. ఈ ఏడాది ఇప్పటిదాకా వచ్చిన మూడు సినిమాల్లో సల్మాన్ ఖాన్ తో చేసిన సికందర్ డిజాస్టర్ కాగా, చావా బ్లాక్ బస్టర్, కుబేర సూపర్ హిట్ అయ్యాయి. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీలో తను కూడా ఉందనే టాక్ ఉంది కానీ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు.
This post was last modified on August 19, 2025 9:35 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…