అయిదేళ్ళు నిర్మాణంలో ఉండి, ఏడెనిమిది సార్లు వాయిదాలు పడి, వందల కోట్ల పెట్టుబడులు మోసిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుందో చూశాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో పీడకలను మిగిలించి డిజాస్టరయ్యింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ పుణ్యమాని ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ వాటిని నిలబెట్టుకునే కంటెంట్ లేకపోవడంతో ఫైనల్ గా ఫెయిల్యూర్ తప్పలేదు. ఇప్పటికే దీనికొచ్చిన నష్టాల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సరే ఆడని సంగతి పక్కనపెడితే థియేటర్లలో చూడని జనాల సంఖ్య లక్షల్లో ఉంది. వాళ్లకు గుడ్ న్యూస్ చెబుతూ అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన ఇచ్చింది.
ఇవాళ అర్ధరాత్రి నుంచి అంటే ఆగస్ట్ 20 హరిహర వీరమల్లు స్ట్రీమింగ్ కు రాబోతోంది. థియేటర్ రిలీజ్ జరుపుకున్న సరిగ్గా 28వ రోజున ఆన్ లైన్ లోకి వచ్చేస్తోంది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఒప్పందం టైంలో నాలుగు వారాల విండో రాసుకున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు షెడ్యూల్ అయ్యింది. కాకపోతే ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ మరీ నాలుగు వారాలకే ఓటిటిలో రావడం అంత మంచి పరిణామం కాదనేది బయ్యర్ వర్గాలు సాధారణంగా చెప్పే మాట. కానీ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఈ తక్కువ విండోనే ప్రొడ్యూసర్లకే శ్రీరామ రక్షలా నిలుస్తోందనేది కూడా వాస్తవమే.
ఇప్పుడు డిజిటల్ లో చూడబోతున్న ఆడియన్స్ రియాక్షన్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ట్రోలింగ్ చేస్తారా లేక సనాతన ధర్మం గురించి పవన్ టచ్ చేసిన కాన్సెప్ట్ ని స్వాగతిస్తారా అనేది ఆసక్తికరం కానుంది. ఇదంతా ఓకే కానీ హరిహర వీరమల్లు పార్ట్ 2 అంతిమ యుద్ధం ఉంటుందో లేదో అనే దానికి సమాధానం ఇన్ డైరెక్ట్ గా దొరుకుతోంది. మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ చూసి సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడం రిస్కే అవుతుంది. పైగా ఇప్పుడొచ్చిన నష్టాలకు తోడు రత్నం కొత్తగా పెట్టుబడులు తేవడం కష్టం. రేపటి నుంచి సోషల్ మీడియాలో హరిహర వీరమల్లుకు సంబంధించిన రియాక్షన్స్ ఎలా ఉంటాయో వెయిట్ అండ్ సీ.
This post was last modified on August 19, 2025 7:29 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…