గతంలో అభిమానులు అంటే.. వాళ్ల హీరోను ఆరాధించడం.. ఆ హీరో సినిమాలను ఆస్వాదించడం.. అవి విజయవంతం కావడానికి తమ వంతు తోడ్పాటు అందించడం.. ఫెయిలైతే బాధ పడడం.. ఇంత వరకే ఉండేది. కానీ ఇప్పుడు ఫ్యానిజం అర్థమే మారిపోతోంది. తమ హీరోను అభిమానాన్ని చాటడం కంటే వేరే హీరోలను డీగ్రేడ్ చేయడంలోనే ఇప్పటి ఫ్యాన్స్ తీరిక లేకుండా గడుపుతున్నారు. తమ హీరో సినిమా రిలీజైనపుడు దానికి అనుకూలంగా డ్యూటీ చేస్తారో లేదో కానీ.. అవతలి హీరో మూవీ విడుదలైనపుడు దాన్ని కిందికి లాగడంలో మాత్రం శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు.
ఈ రకమైన నెగెటివ్ క్యాంపైనింగ్ ఇప్పుడు చాలా సినిమాలను డ్యామేజ్ చేస్తోంది. దీని వల్ల దాదాపుగా అందరు స్టార్ హీరోల సినిమాలూ దెబ్బ తింటున్నాయి. గత కొన్ని నెలల సంగతే తీసుకుంటే.. సంక్రాంతికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’కు వ్యతిరేకంగా ఒక వర్గం అభిమానులు విపరీతమైన దుష్ప్రచారం చేశారు. ఆ సినిమాను ఆన్ లైన్లో లీక్ చేసి దెబ్బ తీయడానికి జరిగిన ప్రయత్నం కూడా వెలుగులోకి వచ్చింది.
గత నెలలో మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ వస్తే దాని గురించి నెగెటివ్ ప్రచారం పీక్ లెవెల్లో జరిగింది. ఈ రెండు చిత్రాలనూ టార్గెట్ చేసిన వాళ్లకు వైసీపీ వాళ్లు కూడా సహకారం అందించారు. కట్ చేస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మూవీ ‘వార్-2’ వచ్చింది. ఇప్పుడు అవతలి వర్గం వాళ్లు డ్యూటీ ఎక్కారు. ఈ సినిమాను డీగ్రేడ్ చేసేలా కుప్పలు తెప్పలుగా పోస్టులు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు.
ఈ మూడు చిత్రాలూ అంచనాలకు తగ్గట్లు లేని మాట వాస్తవం. ప్రధానంగా వాటి ఫెయిల్యూర్లకు అదే కారణం అయినప్పటికీ.. సరైన ఓపెనింగ్స్ కూడా రాకుండా ఇవి దెబ్బ తినడానికి వాటికి వ్యతిరేకంగా జరిగిన హేట్ క్యాంపైనింగ్ ఒక కారణం అనడంలో సందేహం లేదు. దీని వల్ల మధ్యలో నిర్మాతలు అన్యాయం అయిపోతున్నారు. ఈ రకమైన నెగెటివ్ ప్రచారం రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ఈ ఫ్యాన్ వార్స్‌కు అడ్డుకట్ట వేయడానికి ఇండస్ట్రీ వైపు నుంచి ఏదో ఒకటి చేయాల్సిన అవసరముంది. ఇది ఇండస్ట్రీకే ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో హీరోలే తమ అభిమానులకు ఒక పిలుపు ఇస్తే తప్ప వీరిలో మార్పు రాదేమో.
This post was last modified on August 18, 2025 7:21 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…