వార్.. బాలీవుడ్లో పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సిద్దార్థ్ ఆనంద్ రూపొందించాడీ చిత్రాన్ని. 2019లోనే ఈ చిత్రం రూ.475 కోట్ల మేర వసూళ్లు సాధించడం విశేషం. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్శ్‌లో ఆ సమయానికి ఇదే అతి పెద్ద హిట్. హృతిక్ రోషన్ ఈ సినిమాకు అతి పెద్ద ఆకర్షణగా నిలిచాడు. మళ్లీ హృతిక్‌నే పెట్టి సీక్వెల్ తీస్తూ, సౌత్ సూపర్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్‌ను మరో హీరో పాత్రకు ఎంచుకోవడంతో ‘వార్-2’కు మొదట్లో బంపర్ క్రేజ్ కనిపించింది. సినిమా బాగా తీస్తే ఇది వెయ్యి కోట్ల సినిమా అయ్యేదేమో.
కానీ ఇప్పుడు ‘వార్’ వసూళ్లలో 50-60 శాతానికి మించి కలెక్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. హృతిక్‌కు తోడు ఎన్టీఆర్ వచ్చాడు, కోరుకున్నంత బడ్జెట్ పెట్టే నిర్మాత ఉన్నాడు. సీక్వెల్‌కు ఉండే అడ్వాంటేజ్ కూడా ప్లస్. ఇన్ని ఉన్నా ‘వార్-2’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమా యావరేజ్‌గా ఉన్నా కాంబినేషన్, సీక్వెల్ క్రేజ్‌తో బాగా ఆడేది. కానీ సినిమా పాస్ మార్కులు కూడా వేయించుకోలేకపోయింది.
‘వార్-2’ ఫెయిల్యూర్ విషయంలో ప్రధానంగా నిందించాల్సింది దర్శకుడు అయాన్ ముఖర్జీనే. ఇలాంటి యాక్షన్ మూవీని డీల్ చేయడంలో అతడి పనితనం ఏమాత్రం కనిపించలేదు. బ్యాంగ్ బ్యాంగ్, వార్, పఠాన్ చిత్రాలతో స్టైలిష్ యాక్షన్ సినిమాలు తీయడంలో తనకు తానే సాటి అని సిద్దార్థ్ ఆనంద్ రుజువు చేశాడు. తెలిసిన కథలనే అతను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేసేవాడు. తన టేకింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. వీఎఫెక్స్ మీద అతడికి పట్టుంది. కానీ అయాన్ ఈ విషయాలన్నింట్లో తేలిపోయాడు. తన టేకింగే పేలవం. ప్రధాన పాత్రలు రెంటినీ సరిగా తీర్చిదిద్దుకోలేదు. వాటి ప్రెజెంటేషన్, యాక్టర్ల పెర్ఫామెన్స్ కూడా ఎఫెక్టివ్‌గా లేదు. వీఎఫెక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
అన్ని వనరులూ ఉండి కూడా.. వాటిని ఉపయోగించుకోవడంలో అయాన్ విఫలమయ్యాడు. అందుకే ‘వార్-2’కు అంత నెగెటివ్ టాక్ వచ్చింది. దాని బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ కూడా అంతంతమాత్రంగా ఉంది. కారణాలు ఏవైనా కానీ.. ‘వార్’ తీసిన సిద్దార్థ్‌ను కాదని, అయాన్ చేతిలో ‘వార్-2’ను పెట్టడం యశ్ రాజ్ ఫిలిమ్స్ చేసిన అతి పెద్ద తప్పు అనడంలో సందేహం లేదు.
This post was last modified on August 18, 2025 7:18 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…