పదేళ్లు వెనక్కి వెళ్తే వరుస ఫ్లాపులతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న అతడికి పూరి జగన్నాథ్ ‘టెంపర్’ రూపంలో బ్రేక్ ఇచ్చాడు. ప్రి రిలీజ్ ఈవెంట్లో తారక్ మాట్లాడుతూ.. ఇకపై అభిమానులు తలెత్తుకునే సినిమాలే చేస్తా అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన తారక్.. ఆ మాటను నిలబెట్టుకుంటూనే సాగాడు. దశాబ్ద కాలం పాటు అతడికి అపజయమే లేదు. టెంపర్ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలతో విజయాలందుకున్నాడు తారక్. వీటిలో కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్లు అయ్యాయి. కొన్ని ఓ మోస్తరుగా ఆడాయి. కానీ ఏదీ ఫెయిల్యూర్ మాత్రం కాదు.
ఇలా పదేళ్ల పాటు సక్సెస్ స్ట్రీక్ కొనసాగించిన టాప్ స్టార్ టాలీవుడ్లో మరొకరు లేకపోవడం గమనార్హం. ఐతే ఫిలిం ఇండస్ట్రీలో అపజయాలకు అతీతంగా సాగే వాళ్లు అరుదు. అందుకు తారక్ కూడా మినహాయింపు కాలేకపోయాడు. ‘వార్-2’తో తారక్ సక్సెస్ స్ట్రీక్‌కు బ్రేక్ పడిపోయింది. ‘వార్-2’కు తొలి రోజు వచ్చిన టాక్ చూస్తేనే సినిమా నిలబడడం కష్టమని అర్థమైపోయింది. ఐతే హాలిడే వీకెండ్ కావడంతో ఆదివారం వరకు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. సోమవారం ఉదయం షోలు చూస్తేనే ఇక కష్టమని అర్థమైపోయింది. తారక్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నుంచి మూవ్ ఆన్ అయిపోక తప్పదు. ‘వార్-2’తో బాలీవుడ్లో తన సత్తా చాటుకుని, మార్కెట్‌ను మరింత విస్తరిస్తాడన్న వారి ఆశలు ఫలించలేదు.
ఇక తారక్, అతడి అభిమానుల ఫోకస్ ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) మీదికి మళ్లనుంది. ఇది కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే భరోసా ఉంది. ప్రభాస్ బాలీవుడ్లో అరంగేట్రం చేసిన ‘ఆదిపురుష్’కు చేదు అనుభవం ఎదురవగా.. ఆ తర్వాత ‘సలార్’తో అతడికి హిట్ ఇచ్చాడు ప్రశాంత్. తర్వాత ప్రభాస్ ‘కల్కి’తోనూ బ్లాక్ బస్టర్ కొట్టి మళ్లీ టాప్‌లోకి వెళ్లాడు. ఇప్పుడు తారక్‌కు సైతం అలాంటి విజయమే అందిస్తాడని ప్రశాంత్ మీద అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ప్రశాంత్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది, మాస్‌కు విందు భోజనం గ్యారెంటీ అనే అంచానలున్నాయి. కాబట్టి ‘వార్-2’తో తగిలిన దెబ్బకు వచ్చే ఏడాది ‘డ్రాగన్’ మందు వేస్తుందనే ఆశించవచ్చు.
This post was last modified on August 18, 2025 6:32 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…