టన్నుల్లో టాలెంట్ ఉన్నా సక్సెస్ అందని ద్రాక్షలా మారిపోయిన సత్యదేవ్ కు సినిమాలైతే వస్తున్నాయి కానీ సోలోగా ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కడం లేదు. గాడ్ ఫాదర్ లో చిరంజీవి, కింగ్డమ్ లో విజయ్ దేవరకొండతో కీలకమైన పాత్రలు చేసినప్పటికీ కమర్షియల్ గా అవి విజయం సాధించకపోవడంతో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సత్యదేవ్ కు అలాంటి కంటెంట్ ఒకటి పడాలి. రావు బహదూర్ టీజర్ చూస్తే దొరికినట్టే అనిపిస్తోంది. కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ కి మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు.
స్టోరీ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఎప్పుడో తాతల కాలం నాటి రోజుల్లో ఓ ధనవంతుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఖరీదయిన బంగాళాలో వీళ్ళ లవ్ స్టోరీ కొనసాగుతుంది. అయితే అనుమానం పెనుభూతంగా మారినట్టు అతని జీవితంలో ఏర్పడ్డ కొన్ని పరిణామాలు అనూహ్య సంఘటనలకు దారి తీస్తాయి. దీంతో సంవత్సరాలు గడిచిపోయి సదరు రావు బహదూర్ వృద్ధుడైపోతాడు. అంతుచిక్కని రహస్యాలకు నిలయంగా మారిన భవంతిలో ఏముందో పోలీసులు పసిగట్టలేకపోతారు. ఇంతకీ రావు బహదూర్ కు వచ్చిన సందేహం ఏమిటి, అతని లైఫ్ ఎందుకు తలకిందులయ్యిందనేది తెరమీద చూడాలి.
టెక్నికల్ గా రావు బహదూర్ సాలిడ్ గా కనిపిస్తున్నాడు. మాములుగా ఇలాంటి కాన్సెప్ట్స్ మలయాళంలో ఎక్కువగా వర్కౌట్ కావడం చూశాం. గత ఏడాది కిరణ్ అబ్బవరం ఈ జానర్ లో ట్రై చేసిన క మంచి విజయం సాధించింది. ఇప్పుడదే కోవలో ఈ సినిమాను రూపొందించారు. అర్థమయ్యీ కానట్టు టీజర్ ని తెలివిగా కట్ చేయడం కొత్త ఫీలింగ్ ఇచ్చింది. పెర్ఫార్మన్స్ పరంగా సత్యదేవ్ కి అన్ని రకాల షేడ్స్ పొందుపరిచారు. ఇదే హీరో డైరెక్టర్ కలయికలో గతంలో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఈ ప్రాజెక్టులో పార్ట్ నర్ అయ్యాడంటే విషయం బలంగా ఉంటుంది.
This post was last modified on August 18, 2025 2:18 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…