Movie News

45 ఏళ్ళ తర్వాత… తెలుగులో అనిల్ కపూర్

బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ చలాకీదనంతో వేగంగా సినిమాలు చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన గురించి కొత్తగా చెప్పాల్సింది లేదు. యానిమల్ నుంచి మనకు ఇంకా దగ్గరయ్యాడు. 90 దశకంలో మీసాలతో ఖాన్లకు గట్టి పోటీ ఇచ్చిన స్టార్ గా అనిల్ కపూర్ గుర్తింపు ప్రత్యేకం. అయితే తన కెరీర్ ప్రారంభం అయ్యింది టాలీవుడ్ లోనే. 1980 సంవత్సరం బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షంతో సోలో హీరోగా తొలి అడుగులు వేశాడు. అయితే అది ఫ్లాప్ కావడంతో ఇక్కడి దర్శకులు తన ప్రతిభను గుర్తించలేదు. దీంతో ముంబై తిరిగి వెళ్ళిపోయాడు.

తర్వాత అక్కడ బ్లాక్ బస్టర్లు సాధించడం, మార్కెట్ మీద పట్టు సాధించడం జరిగిపోయాయి. నాలుగు దశాబ్దాల తర్వాత అనిల్ కపూర్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ఎంటర్ టైనర్ లో ఆయన్ని ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్టు తెలిసింది. ఇది నిజమైతే ఈ ప్రాజెక్టుకి నార్త్ లో ఇంకొంచెం హైప్ తోడవుతుంది. అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదానేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అనిల్ కపూర్ హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో చాలా బిజీగా ఉన్నాడు. డేట్లు అంత సులభంగా దొరకడం లేదు.

మరి వెంకీ అట్లూరి ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ తో వార్ 2లో  తెరను పంచుకున్న అనిల్ కపూర్ కు అది హిందీ సినిమా కాబట్టి రీ ఎంట్రీ కిందకు రాదు. కానీ సూర్యతో వెంకీ అట్లూరి చేసేతున్న మూవీ బై లింగువల్. తెలుగుతో పాటు తమిళంలో షూట్ చేస్తున్నారు. డబ్బింగ్ కాదు. సో ఆ లెక్కన ఇదే పునఃప్రవేశం కిందకు వస్తుంది. సూర్య, అనిల్ కపూర్ కాంబినేషన్ తెరమీద బాగుంటుంది. 2026 వేసవిని టార్గెట్ గా పెట్టుకున్న సూర్య మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది. కరుప్పు పూర్తయిపోవడంతో సూర్య ఫోకస్ మొత్తం దీని మీదే ఉంది.

This post was last modified on August 17, 2025 8:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నందమూరి హీరోలకు నెంబర్ 2 గండం

అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…

42 minutes ago

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్…

3 hours ago

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

6 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

8 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

10 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

13 hours ago