హిట్టు ఫ్లాపు అందరు హీరోలకు, నిర్మాతలకు సహజం. దీనికి ఎవరూ అతీతులు కాదు. రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి ఒకరిద్దరు తప్ప పరాజయం చూడని వాళ్ళు ఇండస్ట్రీలో ఉండరు. అయితే కొత్త సినిమాల రిలీజుల సందర్భాల్లో నిర్మాతలు అనుసరిస్తున్న టికెట్ రేట్ల పెంపు పద్ధతి మొదట అమృతంగా కనిపించి ఇప్పుడు విషంగా మారుతోంది. టాక్ ఏంటో చూశాక, పబ్లిక్ తీర్పు తెలిశాక కూడా వీకెండ్ తర్వాత సాధారణ రోజుల్లో తగ్గించే ప్రయత్నాలు చేయకపోవడం ప్రొడ్యూసర్లకు తీరని నష్టం కలిగిస్తోంది. గేమ్ ఛేంజర్ నుంచి వార్ 2 దాకా అందరూ జిఓల పేరుతో ఆడుతున్న డేంజరస్ గేమ్ కలెక్షన్లను తినేస్తోంది.
గత ఏడాదికి పైగా ఈ తంతు నడుస్తూనే ఉంది. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. వంద నుంచి నూటా యాభై దాకా ప్రతి టికెట్ మీద ఎంత పెంచినా ప్రేక్షకులు భరిస్తున్నారు, వసూళ్లు ఇస్తున్నారు. కానీ యావరేజ్ లేదా డిజాస్టర్లకు ఈ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గేమ్ ఛేంజర్ నాలుగో రోజుకే క్రాష్ అయినా, డాకు మహారాజ్ పండగ సీజన్ ని పూర్తిగా క్యాష్ చేసుకోలేకపోయినా, హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి స్టామినా బయట పడకపోయినా దానికి యునానిమస్ గా ఒకటే కారణం. టికెట్ రేట్ల పెంపు వారం నుంచి పది రోజుల దాకా అలాగే అమలులో ఉండటం.
సినిమా ఫలితం గురించి వాస్తవ పరిస్థితి బోధపడ్డాక డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు వెంటనే మేల్కొని సోమవారాల నుంచి టికెట్ రేట్లు సాధారణ స్థితికి తీసుకొచ్చే చొరవ తీసుకోవడం లేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేసి మిగిలినవి అలాగే వదిలేస్తున్నారు. దీంతో జనాలు థియేటర్లకు దూరంగా ఉంటున్నారు. తీరా పది రోజుల తర్వాత పాత ధరలు పెట్టినా అబ్బే త్వరలో ఓటిటిలో వస్తుంది కదా ఇంకేం చూస్తాం లెమ్మని లైట్ తీసుకుంటున్నారు. జిఓలు తీసుకోవడం వరకు బాగానే ఉంది కానీ ఖచ్చితంగా పది రోజులు పెంచిన రేట్లే పెట్టమని ప్రభుత్వాలు ఒత్తిడి చేయడం లేదు. అలాంటప్పుడు పరిష్కారం నిర్మాతల చేతుల్లో ఉందనేది స్పష్టం. ఇకనైనా ప్యాన్ ఇండియా మూవీస్ త్వరగా కిల్ అవ్వకూడదంటే చర్యలు తీసుకోవాల్సిందే.
This post was last modified on August 16, 2025 9:38 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…