లెజెండరీ స్టార్ హీరోల వారసులు తెరమీద దూసుకుపోవడం సహజమే కానీ వాళ్ళ కుటుంబాల నుంచి హీరోయిన్లు రావడం అరుదు. తమిళంలో కమల్ హాసన్ దీన్ని బ్రేక్ చేసి శృతి హాసన్ రూపంలో ఇండస్ట్రీకో టాలెంట్ ఇచ్చారు కానీ మిగిలినవాళ్ల వల్ల కాలేదు. ముప్పై సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజులని టాలీవుడ్ కు పరిచయం చేసే ప్రయత్నాలు జరిగాయి. బాలకృష్ణ టాప్ హీరో కోసం ముందు తననే అడిగారని అప్పట్లో టాక్ నడిచింది. కానీ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గారు. తర్వాత మంజుల కాన్సెప్ట్ సినిమాలతో ఏవేవో ప్రయత్నాలు చేసి నటనకు పూర్తిగా స్వస్తి చెప్పారు.
ఇప్పుడు తరం మారింది. అభిమానుల మనోగతాలు పరిణితి చెందుతున్నాయి. దానికి తగ్గట్టే హీరోలు తమ వారసురాళ్లను ప్రోత్సహించే పనిలో ఉన్నారు. ఘట్టమనేని రమేష్ బాబు కూతురు భారతిని తెరంగేట్రం చేయించబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. తండ్రి కాలం చేశాక పిల్లల బాగోగులు మహేష్ బాబే చూస్తున్నాడని టాక్ ఉంది. అందులో భాగంగానే రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఎంట్రీకి ఏర్పాట్లు జరిగిపోయాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ చేశారట. అగ్ర నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం పంచుకోబోయే ఈ ప్రాజెక్టుని భారీ ఎత్తున త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టు రెండు నెలల క్రితమే వార్తొచ్చింది.
ఇప్పుడు భారతిని పరిచయం చేసే బాధ్యతను దర్శకుడు తేజ తీసుకున్నారట. తేజ కొడుకుని హీరోగా పరిచయం చేసే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ద్వారా ఈ అమ్మాయిని లాంచ్ చేస్తారని తెలిసింది. కథని మహేష్ వింటారని మళ్ళీ చెప్పనక్కర్లేదు. కమర్షియల్ రిజల్ట్ పక్కనపెడితే పెర్ఫార్మన్స్ పరంగా తనకు నిజం లాంటి కల్ట్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ గా తేజ మీద మహేష్ కు మంచి గురి ఉంటుంది. దానికి అనుగుణంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని అంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ ఇంచుమించు జయకృష్ణ, భారతి ఒకే టైంలో రంగప్రవేశం చేసేలా ఉన్నారు. చూద్దాం.
This post was last modified on August 16, 2025 4:54 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…