రిలీజ్ ముందు వరకు కూలీదే పూర్తి డామినేషన్. కానీ అనూహ్యంగా రెండో రోజు నుంచి నెంబర్ల గేమ్ మొదలయ్యింది. ముఖ్యంగా నెగటివ్ టాక్ వచ్చిన వార్ 2 కి బుక్ మై షోలో పెద్ద నెంబర్లు కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికిది టాక్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల జరిగింది కాదు. బాలీవుడ్ లో సైయారా తర్వాత చెప్పుకోదగ్గ రిలీజ్ రాలేదు. అజయ్ దేవగన్, త్రిప్తి డిమ్రి కొత్త సినిమాలు రెండూ బోల్తా కొట్టాయి. దీంతో థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం తహతహలాడిన హిందీ ప్రేక్షకులకు వార్ 2 తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అందులోనూ హృతిక్ రోషన్ మూవీ కాబట్టి దానికి ప్రాధాన్యం ఇచ్చేశారు.
వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ఉండటం ఒక బోనస్ గా భావించారు తప్ప ప్రత్యేకంగా ఆ అంశం మీదే ఉత్తరాది జనాలు ఈ సినిమాని చూడటం లేదు. దానికి సాక్ష్యం తెలుగు వెర్షన్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడమే. తారక్ ఇమేజ్ ఓపెనింగ్స్ కి పనికి వచ్చినా అందులో పాత్ర, దాన్ని డిజైన్ చేసిన తీరు ఫ్యాన్స్ కి సైతం నచ్చలేదు. సహజంగానే కామన్ పబ్లిక్ పెదవి విరిచారు. బిసి సెంటర్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ లేకపోవడమే కాక సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ వరకు జూనియర్ పాత్ర నెగటివ్ షేడ్ లో ఉండటం వాళ్ళకు అసలు నచ్చలేదు. ఈ అంశం ఫలితం మీద ప్రభావం చూపించింది.
ఇదే జోరు సోమవారం నుంచి ఉంటుందనే గ్యారంటీ లేదు. ఓపెనింగ్స్ పరంగా హిందీలోనూ వార్ 2 కొత్త రికార్డులు సృష్టించలేకపోయింది. ఆ మాటకొస్తే వార్ కన్నా తక్కువ నెంబర్లే వచ్చాయి. కాకపోతే టాక్ వచ్చినంత తక్కువ స్థాయిలో కలెక్షన్లు పడిపోకపోవడం కొంత ఊరట కలిగిస్తోంది. తెలుగు హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ నాగవంశీకి నష్టాలు తప్పవు. హిందీ కన్నా ఒక్క రూపాయి ఎక్కువ రావాలన్న కోరిక నెరవేరేలా లేదు. కూలికి వచ్చిన మిక్స్డ్ టాక్ సైతం వార్ 2కి ఉపయోగపడలేదు. నార్త్ సైడ్ వార్ 2 పికప్ కావడానికి ప్రధాన కారణం హృతిక్కేనని ఒప్పుకోక తప్పదు. వసూళ్లు స్పష్టం చేస్తున్న వాస్తవమిది.
This post was last modified on August 16, 2025 4:51 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…