కూలీలో విలన్ గా చేయడానికి ముందు ఏడుసార్లు నాగార్జున నెరేషన్ విన్నారని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు పలు ఇంటర్వ్యూలలో స్పష్టంగా చెప్పాడు. నాగ్ సైతం ఇదే మాట అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకున్నారు. కానీ తీరా సినిమా చూశాక రెగ్యులర్ విలన్ తరహాలోనే కనిపించడం నిరాశ కలిగించింది. స్టయిలింగ్, కాస్ట్యూమ్స్ విషయంలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికీ క్యారెక్టరైజేషన్ మాత్రం అసంతృప్తిగానే ఉంది. గోల్డ్ వాచీల స్మగ్లింగ్, శవాల దహనం లాంటి వెరైటీ కాన్సెప్ట్స్ విలన్ కు డిజైన్ చేసినప్పటికీ వాటికి సరైన రీతిలో వాడుకోకపోవడం లోకేష్ చేసిన పొరపాటు.
విచిత్రంగా నాగార్జున చేసిన సైమన్ పాత్ర కన్నా దయాళ్ గా కనిపించిన సౌబిన్ సాహిర్ కే ఎక్కువ లెన్త్, స్కోప్ దక్కడం గమనించాల్సిన విషయం. ఈ క్యారెక్టర్ గురించి చాలా హోమ్ వర్క్ చేశానని లోకేష్ చెప్పిన మాట మాత్రం నిజం. ఎందుకంటే అంత డెప్త్ స్క్రీన్ మీద కనిపించింది. అండర్ కవర్ పోలీస్ గా, పోర్టులో సైమన్ ముఖ్య అనుచరుడిగా, తర్వాత రకరకాల షేడ్స్ లోకి మారిపోయే ప్రతినాయకుడిగా తన నిడివి మాములుగా లేదు. ఎన్నో ఆఫర్లు కూలి కోసం వదులుకున్న సౌబిన్ సాహిర్ కు దానికి తగ్గ ఫలితమే దక్కింది. బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా సౌబిన్ కు ఆఫర్లు వెల్లువెత్తడం ఖాయం.
ఇప్పుడు నాగార్జున అభిమానుల నుంచి వస్తున్న కామెంట్ ఒకటే. కుబేర, కూలి లాంటి సపోర్టింగ్ రోల్స్ కన్నా సోలో హీరోగానే ఎక్కువ సినిమాలు చేయమని. వైల్డ్ డాగ్, ఘోస్ట్ లాంటి ప్రయోగాలు కాకుండా సోగ్గాడే చిన్ని నాయన లాంటి కమర్షియల్ మూవీస్ చేస్తే ఫాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులు కూడా చూస్తారని వాళ్ళ కాన్ఫిడెన్స్. సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ సాధించినట్టు సరైన కంటెంట్ పడితే నాగ్ కు కూడా అంత సత్తా ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. బిగ్ బాస్ 9 కి రెడీ అవుతున్న కింగ్ మరి వాళ్ళ ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకుంటారో లేదో వేచి చూడాలి.
This post was last modified on August 15, 2025 10:44 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…