ఇటీవలి కాలంలో ప్రమోషన్ల కోసం సినిమాని లేపడానికి స్టార్లు ఇస్తున్న స్టేట్ మెంట్లు మేలు కంటే ఎక్కువ చేటే చేస్తున్న వైనం ఈ మధ్య ఎక్కువయ్యింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో ట్రిగ్గరవుతున్నాడు. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెండు కాలర్లు ఎగరేయడమే కాకుండా దర్శకుడు అయాన్ ముఖర్జీని ఆకాశానికి ఎత్తుతూ వన్ అఫ్ ది బెస్ట్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ గా చరిత్రలో నిలిచిపోతాడనే రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు. దీనికి తోడు నిర్మాత నాగవంశీ వార్ 2 అద్భుతంగా అనిపించకపోతే ఇకపై నన్ను నమ్మొద్దనే రేంజ్ లో చెప్పారు. హిందీ కన్నా ఒక్క రూపాయి అయినా ఎక్కువ రావాలని పిలుపునిచ్చారు.
తీరా చూస్తే వార్ 2 పెర్ఫార్మన్స్ కలెక్షన్లలో బయట పడుతోంది. బుక్ మై షోలో మంచి ట్రెండింగ్ లో ఉన్నప్పటికీ ఇండి పెండెన్స్ డే సెలవు కాబట్టి నార్త్ ఆడియన్స్ దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు. సైయారా సునామి తర్వాత బాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క మూవీ కనీస స్థాయిలో ఆడియన్స్ ని ఆకర్షించలేదు. ధఢక్ 2, సన్నాఫ్ సర్దార్ 2 దారుణంగా పోయాయి. దీంతో థియేటర్ ఎంటర్ టైన్మెంట్ కోసం హాలిడే రోజు బాగున్నా బాలేకున్నా వార్ 2 ఒకటే ఛాయస్ అయ్యింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంత సానుకూలంగా లేదు. ఓపెనింగ్ డే రికార్డు ఆశించిన తారక్ అభిమానులకు అది నెరవేరకపోవడం నిరాశే.
ఇక స్టేట్ మెంట్ల విషయానికి వస్తే అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈవెంట్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేయించి మరీ ఆ మూవీ గురించి గొప్పగా చెప్పాడు. తీరా చూస్తే అది డిజాస్టర్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ ఒకటే కోరుతున్నారు. సక్సెస్ అయ్యాక ఎన్ని అన్నా చెల్లుతుంది కానీ అతిశయోక్తితో ప్రీ రిలీజుల్లో ఇస్తున్న స్పీచులు యాంటీ ఫ్యాన్స్ కి అవకాశం ఇస్తున్నాయనేది వాళ్ళ ఆవేదన. నాలుగు మాటలు ఎక్కువ చెప్పడం అందరు హీరోలు చేసేదే. కాకపోతే టెంపర్ తర్వాత ఫ్లాపే ఎరుగని తారక్ ని టార్గెట్ చేసిన గ్రూప్స్ లేకపోలేదు. ఇంతకాలం తప్పించుకున్నా వార్ 2 దొరికే అవకాశం ఇచ్చినట్టయ్యింది.
This post was last modified on August 15, 2025 4:20 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…