ఒక విషయంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా అభినందించాలి. వీళ్ళు ఏనాడూ బాలీవుడ్ వెంట పరుగులు పెట్టలేదు. అక్కడి దర్శక నిర్మాతలు చాలాసార్లు వచ్చి కలిసినా సరే సున్నితంగా తిరస్కరించారు తప్పించి తొందరపడిన దాఖలాలు పాతిక సంవత్సరాల్లో ఎప్పుడూ లేవు. ఇప్పుడీ టాపిక్ రావడానికి కారణముంది. వార్ 2తో జూనియర్ ఎన్టీఆర్ ఊహించని షాక్ తిన్నాడు. యష్ రాజ్ ఫిలింస్, అయాన్ ముఖర్జీలను బ్లైండ్ గా నమ్ముకోవడం బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. ఇంతకు ముందు రామ్ చరణ్, ప్రభాస్ సైతం ఇదే తరహాలో జంజీర్, ఆదిపురుష్ లతో షాకులు తినడం చూశాం. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి.
మహేష్ 29 సినిమాల ప్రస్థానంలో ఒక్క హిందీ దర్శకుడు లేడు. అందరూ దక్షిణాది అందులోనూ టాలీవుడ్ చెందినవాళ్ళే ఎక్కువ. స్పైడర్ తో మురుగదాస్, ఎస్జె సూర్యతో నాని చేసి ఇద్దరు కోలీవుడ్ డైరెక్టర్లకు అవకాశం ఇచ్చాడు కానీ ఆ రెండూ డిజాస్టర్లు కావడం వేరే విషయం. మిగిలిన లిస్టు చూస్తే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నుంచి దర్శకధీర రాజమౌళి దాకా అందరూ తెలుగువాళ్ళే. అనిల్ రావిపూడి, త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, శోభన్, తేజ, గుణశేఖర్, కృష్ణవంశీ, శ్రీకాంత్ అడ్డాల, పరశురామ్ పేట్ల ఇలా అందరి మూలాలు తెలుగులోనే ఉన్నాయి. తన ప్లానింగ్ అలా ఉంటూ వచ్చింది.
అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తాడు. మహేష్ తరహాలోనే రాఘవేంద్రతో మొదలుపెట్టి సుకుమార్ దాకా తాను ఎప్పుడూ హిందీ ఎంట్రీ గురించి ఆలోచించలేదు. ఆ మధ్య సంజయ్ లీల భన్సాలీ లాంటి ఒకరిద్దరు ప్రయత్నించినా ఆలోచించి ఆగాడు తప్పించి కల్ట్ డైరెక్టరని గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పూరి జగన్నాధ్, వివి వినాయక్, క్రిష్, సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్, బోయపాటి శీను అంటూ లోకల్ గా అలోచించి గ్లోబల్ గా ఎదిగాడు. ఆ నమ్మకమే పుష్ప రూపంలో ప్యాన్ ఇండియా మార్కెట్ సృష్టించి ఇచ్చింది. ఇప్పుడు చరణ్, తారక్, ప్రభాస్ పొరపాట్లు చూస్తుంటే మహేష్, బన్నీ ఎంత సరైన దారిలో వెళ్తున్నారో అర్థమవుతుంది.
This post was last modified on August 15, 2025 12:37 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…