Movie News

ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి

నిన్న విడుదలైన కూలీలో నలుగురు అతి పెద్ద స్టార్లున్నారు. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర. అయితే పాత్రల పరంగా వీళ్ళ కన్నా ఎక్కువ స్కోప్, నిడివి, ట్విస్టులు దక్కిన ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి పేరు సౌబిన్ సాహిర్. మంజుమ్మల్ బాయ్స్ తో మనకు దగ్గరైన ఈ మలయాళ నటుడి టాలెంట్ చిన్నది కాదు. తక్కువ బడ్జెట్ చిత్రాలతోనే స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. కూలీలో అవకాశం రాగానే చాలా ఆఫర్లు వదులుకుని మరీ దీని కోసం నెలల తరబడి కాల్ షీట్లు ఇచ్చాడు. ఇప్పుడు తెరమీద దానికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తోంది. నాగ్ కంటే ఎక్కువ విలనిజం తన మీదే పండింది.

టాక్స్, రివ్యూల సంగతి పక్కనపెడితే కూలిలో సౌబిన్ సాహిర్ కు మంచి స్పందన దక్కుతోంది. ముఖ్యంగా క్రూరత్వం నింపుకున్న పాత్రలో నటించడం కాదు జీవించేశాడు. ఒక సీన్ లో నిజంగానే పచ్చి బురదలో నుంచి బయటికి వచ్చి ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం యాక్టింగ్ కు పరాకాష్ట. ఇక రెండో పేరు రచిత రామ్. కన్నడలో పేరున్న హీరోయిన్. 2013లో ప్రభాస్ డార్లింగ్ రీమేక్ బుల్ బుల్ తో పరిచయమై తక్కువ టైంలోనే స్టార్లతో నటించే అవకాశం దక్కించుకుంది. 2022లో సూపర్ మచ్చితో తెలుగులో పరిచయమయ్యింది కానీ అది డిజాస్టర్ కావడంతో మళ్ళీ టాలీవుడ్ ఆఫర్లు రాలేదు. ఇప్పుడు కూలి కొత్త బ్రేక్ ఇచ్చింది.

అతి మాములుగా కనిపించి హఠాత్తుగా షేడ్స్ మారిపోయే పాత్రలో రచిత రామ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ట్విస్టులు ఇక్కడ చెప్పడం భావ్యం కాదు కానీ లోకేష్ కనగరాజ్ తన పాత్రని డిజైన్ చేసిన విధానం నిజంగా బాగుంది. డెప్త్ పరంగా తనకే ఎక్కువ ఎడ్జ్ దక్కిందనేది వాస్తవం. ముఖ్యంగా సెకండాఫ్ గ్రాఫ్ ఈమెతో పాటు సౌబిన్ సాహిర్ మీద ఎక్కువగా నడుస్తుంది. అమీర్ ఖాన్ నైనా గుర్తు పెట్టుకుంటామో లేదో కానీ వీళ్ళు మాత్రం ప్రత్యేకమైన ముద్ర వేస్తారు. బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందనేది పక్కన పెడితే సౌబిన్, రచితలకు తమిళ తెలుగులో మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

This post was last modified on August 15, 2025 11:58 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

35 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago