సోషల్ మీడియా జమానాలో ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని శాశించే దిశగా వెళ్తున్న ట్రెండ్ లో దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయినా దాని వల్ల వచ్చే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. కేవలం నిమిషం టీజర్ తో విశ్వంభర చేసుకున్న డ్యామేజ్ ఎంతో కళ్లారా చూశాం. హరిహర వీరమల్లు సాయంత్రం షోకే కొంత కంటెంట్ మార్చాల్సి వచ్చిందంటే నెగటివ్ ఫీడ్ బ్యాక్ వల్ల వచ్చిన ఇంపాక్టే. ఇప్పుడు వార్ 2 విజువల్ ఎఫెక్ట్స్ మీద సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకటి రెండు చోట్ల మినహాయించి క్వాలిటీ మరీ నాసిరకంగా ఉండటాన్ని అభిమానులే తప్పుబడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో సీన్ నే తీసుకుంటే మరీ ఓవర్ ది బోర్డ్ హీరోయిజంని చూపించే క్రమంలో సముద్రం నుంచి ఆకాశంపైకి వెళ్లి తిరిగి అక్కడి నుంచి దుండగుల షిప్పు మీదకు దాడి చేసే ఎపిసోడ్ లో క్వాలిటీ ఎగుడుదిగుడుగా ఉంది. ఇద్దరు హీరోలు విమానం మీద చేసే ఫైట్ సైతం జారుడు బల్ల తరహాలో మరీ లాజిక్స్ దూరంగా సిల్లీగా అనిపించడానికి కారణం దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆలోచనా విధానం ప్లస్ విఎఫ్ఎక్స్ లోపాలు. ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసేలా పోరాటాలు పెట్టొచ్చు. అవి నమ్మశక్యంగా ఉండాలి. కానీ నవ్వులాటగా ఉండకూడదు. వార్ 2లో జరిగిన తప్పు, తడబాటు ముమ్మాటికీ ఇదే.
విజువల్ ఎఫెక్ట్స్ మీద అతిగా ఆధారపడితే ఇలానే జరుగుతుందని చెప్పడం కాదు. పాతిక ముప్పై సంవత్సరాల క్రితమే కోడి రామకృష్ణ లాంటి దర్శకులు అమ్మోరు, అంజి లాంటి సినిమాల్లో ల్యాండ్ మార్క్ అనిపించే విఎఫ్ఎక్స్ ఎపిసోడ్స్ ని అద్భుతంగా చూపించారు. అలాంటిది సాంకేతిక ఇంత అభివృద్ధి చెందాక కూడా అదిపురుష్, వార్ 2 లాంటివి అత్తెసరు గ్రాఫిక్స్ తో విమర్శలు తెచ్చుకోవడం ముమ్మాటికీ స్వయంకృతాపరాధమే. హనుమాన్, కార్తికేయ 2 పరిమిత బడ్జెట్ లోనే వండర్స్ చేశాయి. మరి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టమని గర్వంగా చెప్పుకున్న వార్ 2 వాటిలో సగం కూడా లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
This post was last modified on August 15, 2025 12:48 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…