ఇతర భాషల దర్శకులను నమ్మడం తప్పేం కాదు. కానీ గుడ్డిగా వాళ్ళ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవడం ఖచ్చితంగా బ్లండరే. ఒకపక్క అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్లు దక్షిణాది దర్శకుల కోసం అర్రులు చాస్తుంటే మనం మాత్రం కనీసం ట్రాక్ రికార్డు చూడకుండా హిందీ డైరెక్టర్లకు పచ్చ జెండా ఊపేయడం దారుణమైన ఫలితాలు ఇస్తోంది. గతంలో రామ్ చరణ్ మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ సాధించాక అపూర్వ లఖియాకి ఎస్ చెప్పడం జంజీర్ లాంటి బ్యాడ్ మూవీని అందించింది. 2013లో సోషల్ మీడియా ఇంత ఉదృతంగా లేకపోయినా ముంబై పత్రికల్లో చరణ్ ని ట్రోలింగ్ చేసే రేంజ్ లో ఆర్టికల్స్ రాసారు.
ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ ఇదే పొరపాటు చేశాడు. నిర్మాణ సంస్థ టి సిరీస్, తానాజీ లాంటి హిట్ తీసిన ఓం రౌత్ కాంబో చూసి ముందు వెనుకా ఆలోచించకుండా రాముడిగా నటించేందుకు ఒప్పుకున్నాడు. ఫలితంగా టీవీలో కూడా ఇంత దారుణమైన విఎఫెక్స్, టేకింగ్ లేదనే రేంజ్ లో ఆడియన్స్, మీడియా అందరూ తిరస్కరించారు. వసూళ్ల నెంబర్లు ఎలా ఉన్నా డార్లింగ్ డిజాస్టర్స్ లో దీనికి ప్రత్యేకమైన చోటు దక్కింది. ఇప్పుడు వార్ 2 ఇదే కోవలో చేరుతోంది. కాలర్ ఎగరేసి మరీ ఎలివేషన్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ స్టేట్ మెంట్ ని వమ్ము చేస్తూ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది.
వార్ ని గతంలో హ్యాండిల్ చేసిన సిద్దార్థ్ ఆనంద్ కాకుండా అయాన్ ముఖర్జీకి ఇవ్వడం ఎంత పెద్ద తప్పో కంటెంట్ చూశాక అర్థమవుతోంది. తన పాత్రకున్న నెగటివ్ షేడ్ అర్థం చేసుకోకుండా, కేవలం హృతిక్ రోషన్ తో కలయికని చెప్పగానే ఎగ్జైట్ అయిపోయిన తారక్ ఇప్పుడు తగిన మూల్యమే చెల్లిస్తున్నాడు. నార్త్ రివ్యూయర్స్ యునానిమస్ గా సినిమాను ఏకిపాడేస్తున్నారు. ఈ మూడు ఉదాహరణల్లో దర్శకుల తప్పులు, ప్రేక్షకులను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్న వైనమే కనిపిస్తోంది. టాలీవుడ్ లోనే బోలెడు టాలెంట్ టన్నుల్లో ఉండగా ఇలా ఉత్తరాది ట్రాప్ పడకుండా మన స్టార్లు జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది.
This post was last modified on August 15, 2025 2:51 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…