అగ్ర హీరోల సినిమాలు వచ్చే ఏడాదిలో చాలా తక్కువ సంఖ్యలో రిలీజ్ అవుతాయి. అంటే పండుగల సీజన్లో కూడా పెద్ద సినిమాలు ఎక్కువగా వుండకపోవచ్చు. ఆచార్య, రాధేశ్యామ్ చిత్రాలే దసరాకు కానీ రాకపోవచ్చుననే టాక్ వినిపిస్తోంది. ఇక పుష్ప, సర్కారు వారి పాట చిత్రాలు 2022లోనే వచ్చేదంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. వీటిలో ఒకటి రెండు సినిమాలు ముందుగా వచ్చేసినా కానీ వచ్చే ఏడాది పూర్తిగా మిడిల్ రేంజ్ సినిమాలదే హవా అవుతుంది. ఈ సంగతిని అందరికంటే ముందుగా పసిగట్టాడు శర్వానంద్. అందుకే ఒక సినిమా తర్వాత మరొకటి అనే తన స్టయిల్‍ని విడిచి పెట్టేసి ప్రస్తుత సిట్యువేషన్‍ని ఫుల్లుగా క్యాష్ చేసుకుంటున్నాడు.
ఇప్పుడు తన సినిమాలు నిర్మాణ దశలో రెండున్నాయి. మరో మూడు సినిమాలు త్వరలోనే పట్టాలెక్కుతున్నాయి. ఆమధ్య ఫ్లాప్స్ రావడంతో తన గ్రాఫ్ పడిపోయినా కానీ శర్వానంద్ అదేమీ పట్టించుకోవడం లేదు. ఈ బంచ్‍లో చేస్తోన్న సినిమాల్లో రెండు, మూడు హిట్టయినా కానీ తన మార్కెట్ ఎటూ పోదని భావిస్తున్నాడు. అందుకే మునుపటి కంటే పారితోషికం కాస్త తగ్గించుకుని నిర్మాతలను మరింతగా ఆకర్షిస్తున్నాడు. కాస్త పేరున్న హీరోలంతా మునుపటి కమిట్‍మెంట్లతో బిజీగా వుండడంతో శర్వానంద్ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నాడు.
This post was last modified on November 20, 2020 10:50 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…