ఇంకొద్ది గంటల్లో కూలీ విడుదల కానుండగా ఒక ముఖ్యమైన ప్రచారానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ చెక్ పెట్టేశారు. కూలి తన సినిమాటిక్ యునివర్స్ లో భాగం కాదని, ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ కు తాను ఇస్తున్న స్టాండ్ అలోన్ మూవీ అని, దేనితోనూ సంబంధం ఉండదని కుండ బద్దలు కొట్టారు. సోషల్ మీడియా వేదికగా కొందరు ఫ్యాన్స్ ట్రైలర్ ని డీ కోడ్ చేసి ఖైదీ, లియో, మాస్టర్ లతో కూలికి కనెక్షన్ ఉందని థియరీలు రాశారు. అక్కడితో వదిలిపెట్టకుండా ఏ పాత్ర ఎలా LCUతో కనెక్ట్ అవుతుందో లాజిక్స్ తో సహా వివరించారు. బహుశా లోకేష్ కూడా ఇంత దూరం ఖచ్చితంగా ఆలోచించి ఉండడు.
ఇది ఇలాగే వదిలేస్తే ఆడియన్స్ అంచనాలు ఇంకోలా పెట్టుకుని వస్తారని భావించిన లోకేష్ కనగరాజ్ ఒక సుదీర్ఘమైన మెసేజ్ ద్వారా వాటికి అడ్డుకట్ట వేశాడు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తన రెండేళ్ల కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించాడు. ఇది కాసేపు పక్కనపెడితే విజువల్ ఎఫెక్ట్స్ లేని సినిమాలు తీస్తూ ప్రశాంత్ నీల్, రాజమౌళి సరసన నిలబడే స్థాయికి మార్కెట్ పెంచుకున్న లోకేష్ కనగరాజ్ నిజంగా ఒక వండరే. ఎందుకంటే కూలికి ఇంత హైప్ రావడానికి రజనీకాంత్ ఎంత కారణమో, అంతే సమానంగా ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా లోకేష్ కే క్రెడిట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
దక్షిణాది రాష్ట్రాలు కూలి ఫీవర్ తో ఊగిపోవడం చూసి తలను పండిన విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ట్రైలర్ కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఇంత బజ్ రావడం ఎవరూ ఊహించలేదు. కోలీవుడ్ లో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వంద కోట్ల గ్రాస్ అందుకున్న తొలి మూవీగా అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టిన కూలి ఏపీ తెలంగాణలోనూ తన మేనియా పవర్ చూపిస్తున్నాడు. హిట్ టాక్ వస్తే మాత్రం ఒకప్పటి నరసింహ, బాషా, అరుణాచలం రేంజ్ లో రజనీకాంత్ విశ్వరూపం బాక్సాఫీస్ వద్ద చూడొచ్చు. జస్ట్ బాగుంది లేదా పర్వాలేదనే మాట వినిపించినా చాలు అరాచకంకి కొత్త అర్థం దొరుకుతుంది.
This post was last modified on August 14, 2025 5:45 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…