ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు పాట పాడే రోజు వచ్చేసింది. డబ్బింగా స్ట్రెయిటా అనేది పక్కన పెడితే రెండు పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో థియేటర్ల దగ్గర వాతావరణం వర్షం కన్నా ఆహ్లాదంగా ఉంది. బుక్ మై షోలో టికెట్లు దొరకడం లేదు. హాలు ఓనర్లు వరస కాల్స్ తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొందరు ఏకంగా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. నిన్నటి దాకా అత్తెసరు ఆక్యుపెన్సీలతో నింపాదిగా కాలం గడిపిన సిబ్బందికి రేపటి నుంచి క్షణం తీరిక ఉండదు. క్యాంటీన్లు, పార్కింగ్ స్టాండ్లు అన్నీ జనంతో కిక్కిరిసిపోనున్నాయి. దానికి తగ్గ ఏర్పాట్లతో సర్వం సిద్ధంగా ఉంది.
అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూలి ముందంజలో ఉన్నప్పటికీ వార్ 2 కూడా ధీటుగా వేగం పుంజుకోవడం తెలుగు రాష్ట్రాల వరకు మంచి పరిణామం. టాక్ కనక పాజిటివ్ ఉంటే రెండు సినిమాలు చేయబోయే ఊచకోత మాములుగా ఉండదు. యుఎస్ నుంచి వినిపిస్తున్న రిపోర్ట్స్ సానుకూలంగానే ఉన్న నేపథ్యంలో అదే తరహాలో ఇక్కడా స్పందన ఉంటే కలెక్షన్ల సునామి మాములుగా ఉండదు. ఒకపక్క వర్షాలు ఇబ్బంది పెడుతున్నా సరే ప్రేక్షకులు వాటిని లెక్క చేయడం లేదు. మొదటిరోజే రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునలను చూసేయాలనే ఆత్రంతో సెకండ్లలో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
గురువారంతో మొదలుపెట్టి ఆదివారం దాకా మొత్తం నాలుగు రోజులు వీకెండ్ రావడం వార్ 2, కూలికి అతి పెద్ద వరంగా నిలవనుంది. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచకుండా గరిష్ట ధరలకే కట్టుబడటం కలెక్షన్ల విషయంలో చాలా పాజిటివ్ గా మారనుంది. అయితే ఏపీలో పెంపు ఇచ్చారు కాబట్టి దాని ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందనేది రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది. కూలీ అడ్వాన్స్ తోనే వంద కోట్లు దాటిన మొదటి కోలీవుడ్ మూవీగా కొత్త రికార్డు సృష్టించగా వార్ 2 స్లో అండ్ స్టడీ సూత్రంగా స్థిరంగా స్పీడందుకునే పనిలో ఉంది. ఇప్పుడు అందరూ కోరుకునేది ఒకటే. రెండు హిట్టవ్వాలి. థియేటర్లు కళకళలాడాలి.
This post was last modified on August 14, 2025 12:34 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…