టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో అక్కినేని నాగార్జున చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరూ చేసి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. శివ, గీతాంజలి, నిన్నే పెళ్ళాడతా, అన్నమయ్య లాంటి ఎన్నో చిత్రాలతో ఆయన ట్రెండ్‌ను బ్రేక్ చేశారు. ఎంతోమంది వర్ధమాన దర్శకులకు అవకాశాలిచ్చి ఎప్పటికప్పుడు వినూత్నమైన పాత్రలు చేశారు. ఐతే ఇన్నేళ్లు చేసిన క్యారెక్టర్లు ఒకెత్తయితే.. ఈ ఏడాది ఆయన చేసిన పాత్రలు మరో ఎత్తు. సోలో హీరోగా కొంచెం బ్రేక్ తీసుకున్న నాగ్.. తమిళ హీరో ధనుష్‌తో కలిసి ‘కుబేర’లో నటించారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేసిన ‘కూలీ’లోనూ భాగమయ్యారు. ‘కుబేర’లో నాగ్ చేసిన చాలా భిన్నమైన పాత్ర.
దీపక్ రాజ్ అనే ఎక్స్ సీబీఐ ఆఫీసర్ పాత్రలో నాగ్ నటించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇమేజ్ ఛట్రం నుంచి పూర్తిగా బయటికి వచ్చి కొంచెం నెగెటివ్ షేడ్స్ కూడా ఉన్న పాత్రలో నాగ్ గొప్పగా నటించాడు. తప్పు చేస్తూ సంఘర్షణకు గురయ్యే పాత్రను పండించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీపక్ పాత్ర నాగ్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.
దీపక్ రాజ్ పాత్రలో కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ అంతిమంగా అది పాజిటివ్ ఇంపాక్టే వేస్తుంది కాబట్టి దాన్ని ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు నాగ్ పెద్ద సాహసానికే రెడీ అయ్యారు. ‘కూలీ’లో ఆయన చేసింది పక్కా విలన్ పాత్ర. అది చాలా భయం గొలిపేలా ఉంటుందని.. నిజ జీవితంలో వ్యక్తులు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని తాను ఆశ్చర్యపోయానని నాగ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. దాన్ని బట్టి అదెంత వయొలెంట్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఐతే టాలీవుడ్ మన్మథుడిని అంత కిరాతకంగా చూసి అభిమానులు తట్టుకోగలరా అన్నది ప్రశ్న. ఐతే నాగ్ విలనే అయినప్పటికీ సైమన్ పాత్రను లోకేష్ కనకరాజ్ తన శైలిలో స్టైలిష్‌గా ప్రెజెంట్ చేసి ఉంటాడని.. తన సినిమాల్లో రోలెక్స్ తరహా విలన్ పాత్రలు ప్రేక్షకులకు ఇచ్చిన అనుభూతిని దృష్టిలో ఉంచుకుని.. రెస్పాన్స్ పాజిటివ్‌గా ఉండొచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సైమన్ పాత్రకు ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే నాగ్ మరోసారి ట్రెండ్ సృష్టించబోతున్నట్లే. ఆయన్ని చూసి మిగతా స్టార్లు కూడా నెగెటివ్ రోల్స్ వైపు అడుగులు వేస్తారేమో.
This post was last modified on August 13, 2025 9:38 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…