Movie News

క్లాష్ వేళ.. రజినీపై హృతిక్ సూపర్ పోస్ట్

రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజవుతుంటే.. ఆయా యూనిట్ సభ్యుల మధ్య పోటీతత్వం ఉంటుంది. అవతలి చిత్రానికి, అందులో భాగమైన వారికి ఎలివేషన్ ఇవ్వడం, ఆల్ ద బెస్ట్ చెప్పడం అందరూ చేయరు. చేసినా ఏదో మొక్కుబడిగానే ఉంటుందంతే. ఐతే బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్.. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. హృతిక్ నటించిన ‘వార్-2’.. రజినీ సినిమా ‘కూలీ’తో గురువారం బాక్సాఫీస్ దగ్గర బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రజినీ మీద తన గౌరవభావాన్ని చాటుతూ హృతిక్ ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు. 

రజినీని తన తొలి టీచర్లలో ఒకడిగా హృతిక్ అభివర్ణించడం విశేషం. ‘‘మీ పక్కనే ఉండి నటుడిగా తొలి అడుగులు వేశాను. రజినీ సార్.. నా తొలి గురువుల్లో మీరు ఒకరు. ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ ఇప్పటికీ మాకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారు. ఆన్ స్క్రీన్ మ్యాజిక్‌ చేస్తూ 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మీకు శుభకాంక్షలు’’ అని హృతిక్ పేర్కొన్నాడు. హృతిక్ చిన్న పిల్లాడిగా ఉండగా.. ఆయన తండ్రి రాకేష్ రోషన్, తాత రోషన్ కలిసి నిర్మించిన బాలీవుడ్ మూవీ ‘భగవాన్ దాదా’లో రజినీకాంత్‌తో కలిసి నటించడం విశేషం. 

అప్పటి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఈ ఫొటోల గురించి ఇటీవల ఓ ఆ కార్యక్రమంలో ప్రస్తావిస్తే హృతిక్ ఎంతో ఎగ్జైట్ అయ్యాడు. అప్పుడు రజినీ ఎంత పెద్ద సూపర్ స్టారో తెలియక, అంకుల్ అంకుల్ అంటూ చాలా క్యాజువల్‌గా మాట్లాడేవాడినని.. ఇప్పుడు ఆయనతో కలిసి నటిస్తే భిన్నంగా ప్రవర్తిస్తానని హృతిక్ చెప్పాడు. తాను ఆ సినిమా షూటింగ్ టైంలో తప్పులు చేసి, మళ్లీ టేక్ తీసుకున్నా.. తప్పు తన మీద వేసుకుని, తానే సరిగా చేయలేదన్నట్లుగా రజినీ చెప్పేవాడని హృతిక్ గుర్తు చేసుకున్నాడు.

This post was last modified on August 13, 2025 9:33 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

2 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

8 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

8 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

8 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

11 hours ago