తెలుగమ్మాయిలకు తెలుుగలో ఛాన్సులు రావడమే కష్టం. అలాంటిది నేరుగా బాలీవుడ్‌కు వెళ్లి అవకాశం అందుకోవడం అంటే గగనమే. శోభిత దూళిపాళ్ల మినహాయిస్తే అలా అవకాశం అందుకున్న వాళ్లు దాదాపుగా కనిపించరు. ఐతే ఇప్పుడు ఓ హైదరాబాదీ అమ్మాయి నేరుగా బాలీవుడ్లో ఒకేసారి రెండు సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. ఆమె తెలుగులో కంటే ముందు హిందీలోనే కథానాయికగా అరంగేట్రం చేస్తుండటం విశేషం. తన పేరు.. అమ్రిన్ ఖురేషి. అందాల పోటీల్లో మెరిసిన ఈ అమ్మాయి.. రాజ్ కుమార్ సంతోషి లాంటి పెద్ద దర్శకుడి సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమా పేరు.. బ్యాడ్ బాయ్.
ఈ చిత్రానికి తెలుగు సినిమాతో కనెక్షన్ ఉండటం విశేషం. కొన్నేళ్ల కిందట తెలుగులో సూపర్ హిట్ అయిన రాజ్ తరుణ్ మూవీ ‘సినిమా చూపిస్త మావ’కు ఇది రీమేక్. ఇందులో ఒకప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడైన నమషి చక్రవర్తి కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఒకప్పుడు అగ్ర కథానాయకులతో సినిమాలు తీసిన రాజ్ కుమార్ సంతోషి.. గత కొన్నేళ్లలో డౌన్ అయినప్పటికీ.. లెజెండరీ స్టేటస్ ఉన్న అలాంటి డైరెక్టర్ చిత్రంతో అమ్రిన్ ఖురేషి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం.
ఆమె మరో హిందీ సినిమాలో కూడా కథానాయికగా నటించబోతోంది. అది కూడా తెలుగు రీమేకే కావడం యాదృచ్ఛికం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘జులాయి’ హిందీలో ఈ రీమేక్‌లో ఎవరు హీరోగా నటించేది ఇంకా ఖరారవ్వలేదు కానీ.. కథానాయికగా మాత్రం అమ్రిన్ ఖురేషి ఫిక్సయింది. కియారా అద్వానీని గుర్తు తెచ్చేలా పర్ఫెక్ట్ లుక్‌తో ఉన్న అమ్రిన్ ఈ సినిమాలో బాలీవుడ్లో ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.
This post was last modified on November 20, 2020 4:54 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…