రేపు విడుదల కాబోతున్న కూలీలో అందరూ రజనీకాంత్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు కానీ అసలైన బిగ్ సర్ప్రైజ్ నాగార్జున కాబోతున్నారనేది యూనిట్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం. ఇప్పటిదాకా నాగే కాదు ఏ స్టార్ హీరో కనిపించనంత వయొలెంట్ షేడ్ లో కింగ్ షాక్ ఇస్తారని అంటున్నారు. నా పిల్లలు, మనవళ్లు మనవరాళ్లకు ఈ పాత్ర చూపించనని ముంబై ప్రెస్ మీట్ లో నాగార్జున చెప్పడం బట్టి చూస్తే ఇది అంచనా వేసినదాని కన్నా చాలా ఇంటెన్స్ గా ఉండబోతున్న క్లారిటీ వచ్చేసింది. అయితే ఎంత డోస్ లో ఉంటుందనేది అందరిలో రేగుతున్న సస్పెన్స్ లాంటి ప్రశ్న.
చెన్నై వర్గాల ప్రకారం నాగార్జున క్యారెక్టర్ ఏదో రెగ్యులర్ విలన్ తరహాలో ఉండదు. బాలీవుడ్ సైతం జడుసుకునే రేంజ్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ దీన్ని స్పెషల్ గా డిజైన్ చేశాడట. ఒకరకంగా చెప్పాలంటే చాలా భాగం రజనీకాంత్ ని సైతం డామినేట్ చేసే స్థాయిలో సైమన్ పాత్ర స్టయిల్, స్వాగ్ ఉంటాయని వినికిడి. తన ఫ్యాన్స్ నిరాశపడకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని లోకేష్ నుంచి హామీ వచ్చాకే నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అందుకే ఏడెనిమిది నెరేషన్లు అవసరమయ్యాట. ఇది కనక క్లిక్ అయితే నాగార్జునకి ఇదే తరహా నెగటివ్ ఆఫర్ల వర్షం వెల్లువెత్తడం ఖాయం.
అయితే అభిమానుల కోణంలో చూసుకుంటే నా సామిరంగా తర్వాత నాగ్ కు ఎక్కువ గ్యాప్ వచ్చేసింది. కుబేర ఏదో అద్భుతం చేస్తుందనుకుంటే దాని వల్ల ధనుష్, శేఖర్ కమ్ముల ఎక్కువ లాభపడ్డారు కానీ చనిపోయే పాత్రలో నాగార్జునకి ఒరిగింది పెద్దగా ఏం లేదనే కామెంట్స్ ని కొట్టిపారేయలేం. ఆ అసంతృప్తిని కూలి తగ్గించాలి. బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తన విలన్ ప్రయాణం స్పెషల్ గా ఉండాలని నాగార్జున కోరుకుంటున్నారు. హీరోగా బోర్ కొట్టేసిందని చెబుతున్న కింగ్ మరి విలన్ గా ఎలాంటి సత్తా చాటుతారో చూడాలి. ఇంకొన్ని గంటల వ్యవధిలో విషయమేంటో తేలిపోతుంది.
This post was last modified on August 13, 2025 2:28 pm
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనను సంతృప్తి పరచడం లేదని బాహాటంగానే…
వ్యూస్ వస్తే డబ్బులొస్తాయి. ఆ పైసల కోసం చేసే పాడు పనులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పే ఒక…