తెలుగులో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యంగ్ యాక్టర్లలో సత్యదేవ్ ఒకడు. కానీ తన ప్రతిభకు తగ్గ అవకాశాలు రావట్లేదని.. మంచి బ్రేక్ అందుకోవట్లేదని చాలామంది సినీ ప్రేమికులు బాధ పడుతుంటారు. ఇటీవలే వచ్చిన ‘కింగ్డమ్’ సినిమాలో కూడా సత్య చేసిన పాత్ర జనాలకు బాగా నచ్చింది. తన పెర్ఫామెన్స్‌కు ప్రశంసలు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘గాడ్ ఫాదర్’ లో విలన్ పాత్ర చేసి చిరుకు దీటుగా నిలబడ్డాడంటే అది తన టాలెంట్ వల్లే.
ఇంకా అనేక పాత్రల్లో అతను అదరగొట్టాడు. కానీ హీరోగా మాత్రం కోరుకున్న బ్రేక్ రావట్లేదు. కొన్ని మంచి సినిమాలు చేసినా అవి ప్రేక్షకులకు రీచ్ కాలేదు. తన కెరీర్‌ను మారుస్తాయని అతను బలంగా నమ్మి చేసిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్నందుకోలేదు. మొత్తంగా ఎంతో టాలెంట్ ఉండి కూడా ఒక స్థాయికి మించి ఎదగలేక ఇబ్బంది పడుతున్నాడు. తన కెరీర్ ఇలా ఉండడం మీద ఇటీవల మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యదేవ్ మాట్లాడాడు.
తనకు ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ బ్యాకప్ దొరక్కపోవడం కెరీర్‌కు ప్రతికూలంగా మారిందని సత్యదేవ్ అంగీకరించాడు. పెద్ద బేనర్లలో సినిమాలు చేస్తే వాటి రేంజ్ వేరు ఉంటుందని.. ప్రేక్షకుల రీచ్ కూడా పెరుగుతుందని.. కానీ ఇప్పటిదాకా తనకు ఆ బ్యాకప్ దొరకలేదని సత్యదేవ్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశాడు. ఐతే ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు సంస్థే సత్యదేవ్ సినిమాను నిర్మిస్తోంది. ‘రావ్ బహదూర్’ పేరుతో కొత్తగా సత్యదేవ్ హీరోగాా ఓ సినిమా అనౌన్స్ అయింది.
ఇంతకుముందు సత్యతో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా తీసిన వెంకటేష్ మహా (కేరాఫ్ కంచరపాలెం ఫేమ్) ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో మహేష్ బాబుతో కలిసి ‘మేజర్’ సినిమాను ప్రొడ్యూస్ చేసిన ఛాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర.. ‘క’ నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహేష్ సంస్థ దీన్ని ప్రెజెంట్ చేస్తోంది. కొంచెం పెద్ద బడ్జెట్లోనే, మంచి క్వాలిటీతో ఈ సినిమా తీయబోతున్నారు. సత్యదేవ్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ మూవీగా చెప్పొచ్చు. ఏకంగా మహేష్ బాబే బ్యాకప్‌గా ఉన్నాడు కాబట్టి సత్యదేవ్ కోరుకున్న రీచ్, సక్సెస్ ఈ సినిమాతో దక్కుతాయని ఆశిద్దాం.
This post was last modified on August 12, 2025 2:17 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…