సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కూలీ’కి మంచి హైప్ తీసుకురావడంలో ‘మోనికా’ పాట కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. సూపర్ హాట్ లుక్స్, స్టెప్పులతో ఈ పాటలో పూజా హెగ్డే అదరగొట్టేసింది. సౌబిన్ షాహిర్ సైతం ఈ పాటలో బాగా హైలైట్ అయ్యాడు. ఇక అనిరుధ్ తన మ్యూజిగ్, వాయిస్ రెంటితోనూ మ్యాజిక్ చేశాడు. సుభాషిణి అనే సింగర్ ఈ పాటను పాడిన తీరు వేరే లెవెల్ అనే చెప్పాలి. మొత్తానికి ఈ పాట ఇన్‌స్టంట్‌గా హిట్టయిపోయింది.
ఇది ఇటాలియన్ లెజెండరీ బ్యూటీ మోనికా బెలూచికి ట్రిబ్యూట్‌గా ఈ పాటను సినిమాలో పెట్టాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. అనిరుధ్‌కు సైతం ఆమె మీద ఆరాధన భావం ఉండడంతో దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. ఈ పాట ఏకంగా మోనికా బెలూచి దగ్గరికి చేరడం విశేషం. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ జర్నలిస్ట్ అనుపమ చోప్రా వెల్లడించారు. ‘కూలీ’ సాంగ్ మోనికాకు చేరడంలో ఆమెనే కీలక పాత్ర పోషించారు. మోనికాకు పరిచయం ఉన్న ఒక ఫిలిం ఫెస్టివల్ హెడ్‌కు అనుపమ ఈ పాటను షేర్ చేశారట. ఆ వ్యక్తి.. మోనికాకు పాటను షేర్ చేశారట. ఈ పాట మోనికా బెలూచికి బాగా నచ్చినట్లు తిరిగి మెసేజ్ అనుపమకు వచ్చిందట.
పూజా హెగ్డేతో జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అనుపమ వెల్లడించారు. ఇది తెలిసి పూజా షాక్ అయింది, ఎంతో ఎగ్జైట్ అయింది. మోనికా అంటే తనతో పాటు టీం అందరికీ ఎంతో ఇష్టం అని.. ఆమె మీద అభిమానంతో చేసిన పాట తన వరకు చేరడం, ఆమెకు నచ్చడం చాలా సంతోషంగా ఉందని పూజా చెప్పింది. ఈ పాట రిలీజైన దగ్గర్నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది మోనికాను ట్యాగ్ చేయడం, కూలీ సినిమా చూడమని అడగడం గమనించానని.. ఆమె మీద చేసిన పాట తన వరకు చేరడం చాలా హ్యాపీ అని పూజా వ్యాఖ్యానించింది.
This post was last modified on August 12, 2025 2:01 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…