Movie News

సెన్సేషనల్ సు… ఇక్కడ సోసోనే

కన్నడలో అంచనాలే లేకుండా చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన సు ఫ్రమ్ సో తెలుగులో మొన్న శుక్రవారం మైత్రి ద్వారా విడుదలయ్యింది. ఒరిజినల్ వెర్షన్ కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగో వారంలోకి అడుగు పెట్టకముందే యాభై కోట్లకు దగ్గరగా వెళ్తున్న ఈ సెన్సేషన్ మన దగ్గర కూడా అదే ఫలితాన్ని అందుకుంటుందని నిర్మాతలు భావించారు. ఆ మేరకు ప్రమోషన్లు చేశారు. టీమ్ హైదరాబాద్ వచ్చి ప్రత్యేకంగా ముచ్చట్లు పంచుకున్నారు. థియేటర్ల బయట వేచి చూసి ఆడియన్స్ రియాక్షన్లు తెలుసుకున్నారు. ఇంతా చేసి సు ఫ్రమ్ సో టాలీవుడ్ లో మాత్రం సోసోగానే వెళ్తోంది.

ఇక చేతిలో ఉన్నది రెండు రోజులే. ఎల్లుండి వార్ 2, కూలీ వచ్చేస్తున్నాయి కాబట్టి సు ఫ్రమ్ సో సెలవు తీసుకోనుంది. గతంలో మైత్రి ఇదే తరహాలో రిలీజ్ చేసిన మంజుమ్మల్ బాయ్స్ మంచి వసూళ్లు సాధించింది. కానీ అదే మేజిక్ ని శాండల్ వుడ్ మూవీ రిపీట్ చేయలేకపోయింది. దీనికి కారణాలు స్పష్టం. నేటివిటీ మన ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. ఆర్గానిక్ కామెడీ ఉన్నప్పటికీ ఇలాంటివి గతంలో చూసిన ఫీలింగ్ మనోళ్లలో ఉంది. దానికి తోడు చిన్న ఈవెంట్ తప్ప పబ్లిసిటీ పరంగా ఎక్కువ శ్రద్ద తీసుకోలేదు. ఫలితంగా ఇది వచ్చిన సంగతే సాధారణ జనాలకు తెలియకుండా పోయింది.

ఇతర భాషల్లో సంచలనం సృష్టించినవి మన దగ్గర సేమ్ రిజల్ట్ అందుకుంటాయన్న గ్యారెంటీ లేదు. సు ఫ్రమ్ సోతో మరోసారి అది ఋజువయ్యింది. ఒకరకంగా చెప్పాలంటే టైటిల్ మైనస్ అయ్యింది. అర్థం కానట్టు వెరైటీగా పెట్టడంతో కామన్ పబ్లిక్ దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. దానికి బదులు మరో పేరు పెట్టినా కొంచెం ఫుల్ వచ్చేదని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహాయించి కింది కేంద్రాల్లో వీకెండ్ లో కూడా పెద్దగా ఆక్యుపెన్సీలు కనిపించలేదు. అన్నింటికన్నా ఎక్కువ మహావతార్ నరసింహ ప్రభావం తీవ్రంగా పడింది. దాని ధాటిని కింగ్డమే తట్టుకోలేకపోయింది. ఇక సు ఫ్రమ్ సో ఎంత.

This post was last modified on August 12, 2025 12:15 pm

Share

Recent Posts

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

32 minutes ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

53 minutes ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

59 minutes ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

7 hours ago

వైసీపీకి మ‌రో షాక్ త‌ప్ప‌దా.. !

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చూసింది ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో…

8 hours ago

డీజే దెబ్బకు ఆగిన గుండె.. అసలేంటీ డీజే?

ప్ర‌స్తుతం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన 'డీజే సౌండ్‌' వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన వినాయ‌క నిమ‌జ్జ‌న…

9 hours ago