Movie News

న్యూ ట్రెండ్.. తమిళ ఈవెంట్ తెలుగులో ప్రసారం

మ‌న ద‌గ్గ‌ర ఒక‌ప్పుడు సినిమా రిలీజ్ ముంగిట ఆడియో వేడుక‌లు ఉండేవి. త‌ర్వాత అవి ప్రి రిలీజ్ ఈవెంట్లుగా రూపాంత‌రం చెందాయి. ఐతే త‌మిళంలో మాత్రం ఇప్ప‌టికీ ఆడియో వేడుక‌లే చేస్తున్నారు. ఐతే సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కొత్త చిత్రం కూలీకి మాత్రం కొంచెం భిన్నంగా ఈవెంట్ చేశారు. కూలీ అన్‌లీష్డ్ పేరుతో జ‌రిగిన ఈ ఈవెంట్‌.. ఆడియో వేడుకకు కొంచెం భిన్నంగా, ఇంకా భారీగా జ‌రిగింది. ఈ సినిమాను నిర్మించిన స‌న్ పిక్చ‌ర్స్ ఎప్ప‌ట్లాగే ఈ ఈవెంట్‌కు యూట్యూబ్ లైవ్ ఇవ్వ‌లేదు. వేరే ఛానెళ్ల‌కూ ఫీడ్ ఇవ్వ‌లేదు. త‌మ స‌న్ టీవీ ఛానెల్లో ఎక్స్‌క్లూజివ్‌గా దీన్ని ప్ర‌సారం చేశారు.

విశేషం ఏంటంటే.. కూలీ ఈవెంట్ తెలుగులో సైతం ప్ర‌సారం కాబోతోంది. ఇందుకు ఆగ‌స్టు 15న రాత్రి 9.30 గంట‌ల‌ను ముహూర్తం పెట్టారు.. స‌న్ నెట్‌వ‌ర్క్‌లో భాగ‌మైన జెమినీ టీవీలో ఈ ఈవెంట్ ప్ర‌సారం కాబోతోంది. త‌మిళ సినిమాల‌కు తెలుగులో చిన్న ఈవెంట్ చేయ‌డం, ప్రెస్ మీట్‌లు పెట్ట‌డం మామూలే కానీ… ఇలా చెన్నైలో త‌మిళంలో జ‌రిగిన ఈవెంట్‌ను తెలుగులో ప్ర‌సారం చేయ‌డం మాత్రం అరుద‌నే చెప్పాలి. బ‌హుశా ఇలా చేస్తుండం తొలిసారి కూడా కావ‌చ్చు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ త‌మిళంలో పెర్ఫామ్ చేసిన పాట‌ల బ‌దులు కూలీ తెలుగు సాంగ్స్ వినిపించ‌నున్నారు. అలాగే స్పీచ్‌ల‌కు తెలుగు వాయిస్ ఓవ‌ర్ చేయిస్తున్నారు.
ఇప్ప‌టిదాకా త‌మిళ సినిమాల‌ను డబ్ చేయ‌డం చూశాం కానీ.. ఇప్పుడు ఈవెంట్ల‌ను కూడా అనువాదం చేస్తున్నారా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

కూలీ తెలుగు ప్ర‌మోష‌న్ల మీద టీం పెడుతున్న శ్ర‌ద్ధ‌కు ఇది నిద‌ర్శ‌నం కావ‌చ్చు. ఐతే ఇంత చేస్తున్నారు బాగుంది కానీ.. ర‌జినీని హైద‌రాబాద్‌కు ర‌ప్పించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలుగు కూలీ సినిమాకు బంప‌ర్ హైప్ వ‌చ్చింది. ర‌జినీ సినిమాల‌కు మామూలుగానే ఇక్క‌డ క్రేజ్ ఉంటుంది కానీ.. లోకేష్ క‌న‌క‌రాజ్ డైరెక్ష‌ణ్, నాగ్ విల‌న్ పాత్ర చేయ‌డం, ఉపేంద్ర ప్ర‌త్యేక పాత్ర పోషించ‌డం దీనికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌ల‌య్యాయి. ఆగ‌స్టు 14న వార్‌-2తో పాటుగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

This post was last modified on August 12, 2025 11:15 am

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

1 hour ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

2 hours ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

3 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

4 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

4 hours ago