అదేంటి రెండు అతి పెద్ద మల్టీస్టారర్స్ నువ్వా నేనా అని తలపడుతుంటే మధ్యలో చిన్న సినిమా ప్రస్తావన ఏమనుకుంటున్నారా. వివరాలు చూస్తే మీకూ ఆశ్చర్యం కలుగుతుంది. కాకపోతే ఇది మన రాష్ట్రంలో కాదులెండి. వెస్ట్ బెంగాల్ లో ఆగస్ట్ 14న ధూమ్ కేతు అనే బెంగాలీ మూవీ రిలీజవుతోంది. ఇది ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు మోక్షం దక్కించుకుంటోంది. మాములుగా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ లాంటి వాళ్ళు రేస్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు క్లాష్ కి రిస్క్ చేయరు. కానీ ధూమ్ కేతు ప్రొడ్యూసర్లు సై అంటే సై అని ప్రకటన ఇచ్చి బుకింగ్స్ మొదలుపెట్టేశారు.
ట్విస్ట్ ఏంటంటే ధూమ్ కేతు ఇప్పటిదాకా 18 వేలకు పైగా టికెట్లు అమ్మగా వార్ 2 దీనికన్నా చాలా వెనుకబడి కేవలం 5 వేల టికెట్లను దాటింది. ఇక కూలి గురించి చెప్పాల్సిన పని లేదు. సింగల్ డిజిట్ లోనే ఉంది. అయితే ఈ ట్రెండ్ కేవలం పశ్చిమ బెంగాల్ కు మాత్రమే పరిమితం. పరిస్థితి గమనించిన యష్ రాజ్ ఫిలింస్ ధూమ్ కేతుకి అదనంగా కొన్ని థియేటర్లు, షోలు ఇవ్వడానికి అంగీకరించిందట. ఇక్కడ అసలైన ట్విస్ట్ మరొకటి ఉంది. ధూమ్ కేతు కొత్త సినిమా కాదు. పది సంవత్సరాల క్రితం మొదలై 2017లో షూటింగ్ పూర్తి చేసుకుంది. కాకపోతే ల్యాబ్ లో మగ్గుతూ ఇన్నేళ్ల తర్వాత మోక్షం దక్కించుకుంది.
ఈ పరిణామం పట్ల బెంగాలీ ట్రేడ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. మాములుగా ఇలాంటి ఆలస్యమైన సినిమాలకు క్రేజ్ ఉండదని, అందుకే బిజినెస్ ఆఫర్లు తక్కువగా ఉంటాయని, కానీ స్టార్ క్యాస్టింగ్ వల్ల ధూమ్ కేతుకి హైప్ వచ్చిందని అభిప్రాయపడ్డారు. కొన్ని విచిత్రాలు ఇలాగే ఉంటాయి. దేశమంతా కూలి, వార్ 2 జ్వరంలో మునిగి తేలుతూ ఉంటే బెంగాల్ లో మాత్రం రివర్స్ లో ఉండటం అనూహ్యం. ఒకవేళ ధూమ్ కేతు కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అక్కడి ఆడియన్స్ లోకల్ ఫీలింగ్ తో దానికే పట్టం కట్టేలా ఉన్నారు. అంతే మరి ప్రాంతీయాభిమానం ఉంటే ఇలాంటివి ఎన్నో జరుగుతాయి.
This post was last modified on August 12, 2025 11:35 am
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…