యానిమల్ ని ఇమిటేట్ చేయబోయి బాలీవుడ్ మేకర్స్ భలే కళాఖండాలు వదులుతున్నారు. తెరనిండా రక్తపాతం, హీరో విలన్ కత్తులు పట్టుకుని మనుషులను కొత్తిమీర కట్టాలా నరికి చంపేయడం, ఇలాంటివి పెడితే చాలు జనం ఎగబడి చూస్తారనే భ్రమలో ఉన్నారు. తాజాగా విడుదలైన భాగీ 4 టీజర్ చూస్తే అదే అనుమానం కలుగుతుంది. జాకీ శ్రోఫ్, సంజయ్ దత్ చాలదన్నట్టు ఇద్దరు హీరోయిన్లతో కూడా భీభత్సం అనిపించేలా బ్లడ్ బాత్ చేయించడం మహా విచిత్రంగా ఉంది. నిమిషంన్నర వీడియోలో ఎన్ని మర్డర్లు జరిగాయంటే లెక్క బెట్టడం కష్టం. స్లో మోషన్ లోనే రెండుమూడు సార్లు చూడాల్సి వచ్చేలా ఉంది.
భాగీ 4 దర్శకుడు ఏ హర్ష. శాండల్ వుడ్ కు చెందిన ఈ కమర్షియల్ డైరెక్టర్ కి ఇది మొదటి హిందీ డెబ్యూ. పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదూ. గోపీచంద్ డ్యూయల్ రోల్ చేసిన భీమా తీసింది కూడా ఈయనే. ఆ సినిమాలో కూడా హింస ఉంటుంది కానీ మరీ ఇంత అరాచకంగా కాదు. భాగీ 4 లో ఉద్దేశపూర్వకంగా రక్త స్నానం చేయించినట్టు ఉంది కానీ కంటెంట్ అంత డిమాండ్ చేయడం అనుమానమే. ఆ మధ్య సోను సూద్ కూడా ఇదే తరహాలో సోలో హీరోగా స్వీయ దర్శకత్వంలో ఫతే తీశాడు. అచ్చం యానిమల్ ని పోలిన బ్లాక్స్ ఇందులో ఉంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాకపోవడం వేరే విషయం.
ఏది ఏమైనా మన తెలుగు దర్శకుల క్రియేటివిటీని అందుకోవడం అంత సులభం కాదు. సందీప్ రెడ్డి వంగా, రాజమౌళి, సుకుమార్ లాంటి వాళ్ళను చాలా డైరెక్టర్లు ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు కానీ అందరూ ఫెయిలైన వాళ్లే. ఇప్పుడు భాగీ 4 దీన్నేమైనా మారుస్తుందేమో చూడాలి. సెప్టెంబర్ 5 విడుదల కాబోతున్న ఈ వయొలెంట్ డ్రామాకు అనుష్క ఘాటీ, తేజ సజ్జ మిరాయ్, శివ కార్తికేయన్ మదరాసి, విజయ్ ఆంటోనీ భద్రకాళీలు పోటీతో స్వాగతం చెప్పబోతున్నాయి. భాగీ మొదటి భాగం వర్షం రీమేక్ గా తీశారు కానీ మిగిలినవన్నీ కొత్త కథలతో రూపొందినవే. పార్ట్ ఫోర్ ఏం చేస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates