ఇప్పటిదాకా వచ్చిన వార్ 2 ప్రమోషనల్ కంటెంట్ లో విలన్ ఎవరో తెలియకుండా జాగ్రత్త పడిన యష్ రాజ్ ఫిలిమ్స్ ఎట్టకేలకు అతని ద్వారానే ప్రేక్షకులకు పరిచయం జరిపించేసింది. యానిమల్ తో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన బాబీ డియోల్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లకు సవాల్ విసిరే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటిదాకా స్పై యూనివర్స్ లో ఒక్క సినిమా చేయలేదని, ఏకంగా ఎపిక్ ఎంట్రీ దొరకడం చాలా ఆనందంగా ఉందని బాబీ డియోల్ చెప్పడంతో వార్ 2 మీద ఇంకో అదనపు ఆకర్షణ తోడయ్యింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ చాలా ఇంటెన్స్ గా క్యారెక్టర్ డిజైన్ చేశారట.
షూటింగ్ టైంలో ప్రచారం జరిగినట్టు ఇద్దరు హీరోల్లో ఒకరికి నెగటివ్ షేడ్ ఉంటుందనేది వాస్తవం కాదు. కాకపోతే రెండు పాత్రలకు మధ్య ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందని, అది తెరమీద సర్ప్రైజ్ ఇస్తుందని టీమ్ చెబుతోంది. యష్ రాజ్ సంస్థ టైగర్ 3 ద్వారా ఇమ్రాన్ హష్మీని గూఢచారి ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు బాబీ డియోల్ ని లాంచ్ చేయడం ద్వారా స్కేల్ ఎంత పెద్దది అవుతోందో చెప్పినట్టే. ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. భారీ రిలీజ్ ప్లాన్ చేసుకున్న యష్ రాజ్ ఫిలిమ్స్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా వాటిని ఇంకో స్థాయికి తీసుకెళ్లింది.
కూలి డామినేషన్ లో కొంచెం వెనుకబడినట్టు కనిపిస్తున్న వార్ 2 మెల్లగా బజ్ పెంచేసుకుంటోంది. కియారా అద్వానీ గ్లామర్, బాబీ డియోల్ విలనిజం, భారీ యాక్షన్ ఎపిసోడ్లు, తారక్ హృతిక్ మధ్య ఫైట్లు ఇలా కంటెంట్ పరంగా హై వోల్టేజ్ ఉన్నప్పటికీ పబ్లిసిటీ విషయంలో కొంత వెనుకబడి ఉండటం ఫ్యాన్స్ లో అసంతృప్తి రేపింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత లెక్కలు మారాయనే చెప్పాలి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ తమ వంతుగా ఎలివేషన్లు ఎంత ఇవ్వాలో వాటిని సంపూర్ణంగా నెరవేర్చారు. ఇంకో నాలుగు రోజుల్లో రాబోయే తీర్పు కోసం ఇండస్ట్రీ సైతం అతృతగా ఎదురు చూస్తోంది.
This post was last modified on August 11, 2025 2:19 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…