Movie News

తారక్ మాట: మా అమ్మ లక్ష్మి గారు…

జూనియర్ ఎన్టీఆర్ తల్లి పేరు షాలిని అన్న సంగతి తెలిసిందే. కానీ ‘వార్-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో షాలినితో పాటు తన అన్న కళ్యాణ్ రామ్ తల్లి అయిన లక్ష్మిని కూడా తల్లిగా సంబోధించి తన అన్న కుటుంబంతో తనకు ఎలాంటి అనుబంధం ఉందో చాటి చెప్పాడు. తన పాతికేళ్ల సినీ ప్రయాణం గురించి ఎంతో ఉద్వేగంగా మాట్లాడిన తారక్.. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులందరినీ గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా తన తండ్రి హరికృష్ణ పేరును ప్రస్తావించాడు తారక్. ఆ తర్వాత తల్లి షాలిని పేరు చెప్పి.. కళ్యాణ్ రామ్ తల్లి లక్ష్మిని కూడా తన తల్లి అనే సంబోధించాడు తారక్. ఆ తర్వాత దివంగత జానకిరామ్, కళ్యాణ్ రామ్‌ల పేర్లు ప్రస్తావించి.. వీళ్లందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నాడు.

ఇక సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఆశీస్సులు తనపై ఎప్పుడూ ఉంటాయని.. అవి ఉన్నంత వరకు తనను ఎవ్వరూ ఆపలేరని వ్యాఖ్యానించాడు తారక్. ఇక అభిమానుల గురించి మాట్లాడుతూ తారక్ ఎప్పట్లాగే భావోద్వేగానికి గురయ్యాడు. పాతికేళ్ల ముందు తన తొలి సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లినపుడు తన వెంట తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారని.. వారు కాకుండా ఒక్కరూ లేరని.. అలాంటిది ఇప్పుడు ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నానని తారక్ చెప్పాడు. తొలి సినిమా మొదలైనపుడు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో తెలియదని తారక్ అన్నాడు.

ఐతే తన తొలి సినిమా రిలీజ్ కాకముందే ముజీబ్ అని ఆదోని నుంచి ఒక వ్యక్తి వచ్చాడని.. మెహిదీపట్నంలోని తన ఆఫీస్‌కు అతను వస్తే ఎవరు అని అడిగితే ఫ్యాన్ అన్నాడని.. తొలి సినిమా రిలీజ్ కాకముందే ఫ్యాన్ ఏంటి అని అడిగితే.. తానంటే పడిచచ్చిపోతానని చెప్పాడని తారక్ గుర్తు చేసుకున్నాడు. అంతలో ఆ ఫ్యాన్ వేదిక మీదికి రాగా.. అతణ్ని అభిమానులకు పరిచయం చేశాడు తారక్.

తనకు జన్మనిచ్చింది తన తండ్రి హరికృష్ణ అయినప్పటికీ.. ఈ జీవితం అభిమానులకే అంకితమమని.. ఈ విషయాన్ని తన తండ్రితో కూడా చెప్పానని తారక్ అన్నాడు. ఇక ఫ్యాన్ వార్స్ వద్దంటూ అభిమానులను సుతిమెత్తగా హెచ్చరించిన తారక్.. మనకంటే గొప్ప వాళ్లు చాలామంది ఉన్నారని, వాళ్లను గౌరవించాలని హితవు పలికాడు. వార్-2 సినిమా చాలా కష్టపడి చేశామని.. సినిమా గొప్పగా ఉంటుందని.. ఇందులో చాలా ట్విస్టులు ఉంటాయని.. వాటిని బయటపెట్టకండని అభిమానులను కోరాడు తారక్. తన ప్రసంగం చివర్లో అభిమానులకు తారక్ శిరస్సు వంచి వందనం చేయడం విశేషం.

This post was last modified on August 11, 2025 12:58 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

3 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

3 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

5 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

7 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

7 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

9 hours ago