బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరైన ఆమిర్ ఖాన్.. ఇటీవల ఓ కుటుంబ వివాదంలో చిక్కుకున్నాడు. తన మీద సొంత సోదరుడే సంచలన ఆరోపణలు చేశాడు. ఆమిర్‌కు, అతడి తమ్ముడు ఫైసల్ ఖాన్‌కు చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో కోర్టులో వీరి మధ్య కేసు కూడా నడుస్తోంది. ఐతే ఫైసల్ గతంలో మానసిక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో తనను ఆమిర్ ఏడాది పాటు గదిలో బంధించాడని.. తన ఫోన్ లాక్కుని, తండ్రితో కూడా మాట్లాడకుండా చేశాడని అతను మీడియాకు వెల్లడించాడు.
కొన్నేళ్ల పాటు తాను అన్న వల్ల మనో వేదన అనుభవించినట్లు ఫైసల్ తెలిపాడు. ఈ ఆరోపణలు మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆమిర్ స్పందించాడు. తన కుటుంబం తరఫున మీడియాకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఇది కుటుంబ విషయమని, దీన్ని ఒక గాసిప్ లాగా మార్చొద్దని అతను విన్నవించాడు. తన తమ్ముడి మీద ప్రతిగా అతనెలాంటి ఆరోపణలు చేయలేదు.
ఫైసల్‌కు సంబంధించి ప్రతి నిర్ణయం కుటుంబమంతా సమష్టిగానే తీసుకున్నట్లు ఈ ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. ఎంతోమంది వైద్యులను సంప్రదించాక తనకు వైద్యం అందించామని.. ఎప్పుడూ తన శ్రేయస్సు కోసమే ఆలోచించామని ఆమిర్ కుటుంబం స్పష్టం చేసింది. ఇది కుటుంబ విషయం కాబట్టే ఇన్ని రోజులు స్పందించలేదని.. తన గురించి ఎక్కడ మాట్లాడకుండా గోప్యత పాటించామని.. ఈ విషయాన్ని పెద్దది చేయొద్దని మీడియాకు ఆమిర్ కుటుంబం విన్నవించింది. ఈ గొడవను అసభ్యకరంగా చూపించి.. రెచ్చగొట్టేలా, కుటుంబం బాధ పడేలా వార్తలు కథనాలు రాయొద్దని వేడుకుంటున్నామని ఆమిర్ కుటుంబం పేర్కొంది.
This post was last modified on August 11, 2025 12:07 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…