పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన హిమాన్షి.. బిగ్‌బాస్ లోనా?

బిగ్‌బాస్ సీజన్ 19 ఆగస్టు 24న ప్రారంభం కానుండగా, కాంటెస్టెంట్‌ల జాబితా పై రోజుకో వార్త వైరల్ అవుతోంది. ఇక లేటెస్ట్ గా ప్రచారం అవుతున్న మరో పేరు హిమాన్షి నర్వాల్. ఈమె పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయారు. నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య అయిన హిమాన్షి, ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన దాడిలో జీవిత భాగస్వామిని కోల్పోయారు. ఆ ఘటన తర్వాత ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఓ వర్గం బాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, బిగ్‌బాస్ మేకర్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే కంటెస్టెంట్‌లను కోరుకుంటున్నారు. ఆ కోణంలో హిమాన్షి పేరు పరిగణనలోకి తీసుకున్నారని టాక్ వస్తోంది. ప్రేక్షకులకు దగ్గరయ్యే వ్యక్తులు అవసరం. అందుకే హిమాన్షి నర్వాల్‌ను పరిగణిస్తున్నారు. కానీ ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు అని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో, కొన్ని సోషల్ మీడియా పేజీలు మాత్రం ఇది దేశానికి సంబంధించిన సెన్సిటివ్ అంశం అని ఆమెను సంప్రదించలేదని, ఈ షోలో భాగం కాదని చెబుతున్నాయి.

హిమాన్షి కథ వెనుక ఉన్న విషాదం చాలా మందిని కదిలించింది. తమ హనీమూన్ కోసం కాశ్మీర్ పహల్గాం వెళ్లిన దంపతులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ దాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ మృతిచెందగా, హిమాన్షి క్షేమంగా బయటపడ్డారు. ఘటన స్థలంలో భర్త పక్కన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆమె ఫోటోలు దేశమంతా చర్చనీయాంశం అయ్యాయి.

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్ తన వ్లాగ్‌లో హిమాన్షి తన కాలేజ్ మేట్ అని చెప్పారు. “2018లో కాలేజ్ పూర్తయ్యాక మేము మాట్లాడలేదు. గుజరాత్, ఢిల్లీ మా ప్రదేశం. మేము అప్పట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఆమె నంబర్ నా దగ్గర ఉంది కానీ ఆ సమయంలో కాల్ చేయడం సాధ్యం కాలేదు” అని ఎల్విష్ చెప్పాడు. ఇక బిగ్‌బాస్ 19లోకి వచ్చే అవకాశమున్న ఇతర పేర్లలో శైలేష్ లోధా, గురుచరణ్ సింగ్, మున్న్మున్ దత్తా, లతా సబర్వాల్, ఫైసల్ షేక్ (మిస్టర్ ఫైసు), జన్నత్ జుబైర్, పూరవ్ ఝా, అపూర్వ ముఖిజా వంటి వారు ఉన్నారు. హిమాన్షి ఎంట్రీ నిజమా కాదా అనేది షో ప్రారంభానికి ముందే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.