Movie News

సినీ కార్మికుల వేత‌నాల‌ పెంపుకు ఓకే… కానీ

త‌మ వేత‌నాలు, పారితోష‌కాల‌ను 30 శాతం మేర పెంచాలంటూ తెలుగు ఫిలిం ఫెడ‌రేష‌న్ ఇటీవ‌ల మెరుపు స‌మ్మెకు దిగ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ సమ్మెతో హ‌ఠాత్తుగా షూటింగ్స్ ఆగిపోవ‌డంతో ఇండ‌స్ట్రీ అంతా స్తంభించిపోయింది. ఇప్ప‌టికే మిగ‌తా ఇండ‌స్ట్రీల‌తో పోలిస్తే తెలుగులో సినీ కార్మికుల వేత‌నాలు ఎక్కువ అంటూ కొంద‌రు నిర్మాత‌లు ఈ స‌మ్మెకు వ్య‌తిరేకంగా మాట్లాడారు. అదే స‌మ‌యంలో మూడేళ్లుగా వేత‌నాల్లో పెంపు లేని నేప‌థ్యంలో కార్మికుల డిమాండ్ న్యాయ‌మైందే అన్న అభిప్రాయాలూ వినిపించాయి. కానీ ఒకేసారి 30 శాతం పెంపు అంటే క‌ష్టం అనే వాద‌నా వినిపించింది.

ఈ నేప‌థ్యంలో సినీ కార్మికుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ పెద్ద‌లు.. ఆమోద‌యోగ్య‌మైన ప‌రిష్కారం తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు.. జీతాలు పెంచ‌డానికి స‌రే అన్నారు కానీ.. కార్మికులు కోరుకున్న‌ట్లు కాదు. విడ‌త‌ల వారీగా వేత‌నాలు పెంచేలా ఫిలిం ఛాంబ‌ర్ నిర్ణ‌యం తీసుకుంది. ఆ వివ‌రాల‌ను సీనియ‌ర్ నిర్మాత దామోద‌ర ప్ర‌సాద్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

రోజుకు రూ.2 వేలు సంపాదిస్తున్న సినీ కార్మికుడికి ఈ ఏడాది 15 శాతం పెంచ‌డానికి చాంబ‌ర్ అంగీక‌రించింది. వ‌చ్చే ఏడాది 5 శాతం, ఆ త‌ర్వాతి ఏడాది మ‌రో 5శాతం వేత‌నం పెరుగుతుంది. కార్మికులు ఎక్కువ అడిగారు కానీ.. తాము ఈ మేర‌కు పెంచేందుకు ఒప్పుకున్నామ‌ని దామోద‌ర ప్ర‌సాద్ తెలిపారు. రోజూ వెయ్యి రూపాయ‌లు సంపాదిస్తున్న కార్మికుడికి ఇప్పుడు 20 శాతం పెంచేలా ప్ర‌తిపాదించారు. రెండో ఏడాది పెంపు ఉండ‌దు. మూడో ఏడాది 5 శాతం పెంపు ఉంటుంది.

చిన్న సినిమాల‌కు ప‌ని చేస్తున్న కార్మికులకు మాత్రం అవే వేత‌నాలు కొన‌సాగ‌నున్నాయి. లో బ‌డ్జెట్లో తీసే సినిమాల మీద భారం ప‌డ‌కుండా వాటికి ప‌ని చేసే కార్మికుల‌కు మాత్రం అవే జీతాలు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. తాము ఈ మేర‌కు ప్ర‌తిపాదించామ‌ని.. వీటికి కార్మికులు స‌రే అంటే ఆ మేర‌కు వేత‌నాలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని దామోద‌ర ప్ర‌సాద్ తెలిపారు. మ‌రి అంతిమంగా ఇరు వ‌ర్గాలు ఏం నిర్ణ‌యిస్తాయో చూడాలి.

This post was last modified on August 9, 2025 8:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago