Movie News

నాగవంశీ… ఉక్కిరి బిక్కిరి

త్రివిక్రమ్‌కు ఆస్థాన నిర్మాణ సంస్థలా మారిన హారిక హాసిని క్రియేషన్స్‌లో నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబుకు తెర వెనుక సాయం అందిస్తూ, మీడియా దూరంగా లో ప్రొఫైల్ మెయొంటైన్ చేసేవాడు సూర్యదేవర నాగవంశీ. చినబాబు ఆయనకు బాబాయి. ఐతే కొన్నాళ్ల ప్రయాణం తర్వాత.. సొంతంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ పెట్టి.. మిడ్ రేంజ్ సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. అలా చూస్తుండగానే తన రేంజ్ మారిపోయింది. హారిక హాసిని సంస్థను మించి సితార ఎదిగిపోయింది. వరుసగా సినిమాలు నిర్మిస్తూ, మరోవైపు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, నిలడగా విజయాలూ అందుకుంటూ టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్లలో ఒకడైపోయాడు నాగవంశీ.

ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అయిపోవడంతో టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ ప్రొడ్యూసర్ అయిపోయాడు నాగవంశీ. అందులోనూ ఈ ఏడాది నాగవంశీ పేరు మామూలుగా మోగట్లేదు. టాలీవుడ్లో బాగా సక్సెస్ రేట్ పడిపోయిన స్థితిలో సంక్రాంతికి ‘డాకు మహారాజ్’, వేసవిలో ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో విజయాలందుకున్నాడు. ఇక జులై-ఆగస్టు నెలల్లో నాగవంశీ మామూలు బిజీగా లేడు. జులై నెలాఖరులో ఆయన సినిమా ‘కింగ్డమ్’ రిలీజైంది. వీకెండ్లో ఆ సినిమా మంచి వసూళ్లు సాధించింది.

ఆ సినిమా హడావుడి కొంచెం తగ్గేసరికే తన డిస్ట్రిబ్యూషన్లో రాబోతున్న ‘వార్-2’కు ప్రమోషన్లు మొదలుపెట్టాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర హంగామా ఎలా ఉంటుందో, అభిమానులు ఎంత హడావుడి చేస్తారో తెలిసిందే. ఈ చిత్రంపై భారీ పెట్టుబడి పెట్టిన నాగవంశీ.. దాని మీద లాభాలు సంపాదించడానికి స్ట్రాటజిగ్గా అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా నాగవంశీ ఊపిరి తీసుకునే అవకాశం లేదు.

ఇంకో రెండు వారాలకే మాస్ రాజా రవితేజ సినిమా ‘మాస్ జాతర’ రాబోతోంది. దాని మీదా భారీ అంచనాలున్నాయి. ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్, రిలీజ్ పనులు చూసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి క్రేజీ సినిమాలు రిలీజ్ చేస్తూ.. వాటికి సంబంధించిన అన్ని పనులూ చూసుకుంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు నాగవంశీ. టాలీవుడ్లో ప్రస్తుతం ఇంత బిజీగా ఉన్న నిర్మాత మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు.

This post was last modified on August 9, 2025 4:42 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Naga Vamsi

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago