బయట ప్రచారాలు ఎన్ని జరుగుతున్నా ఇప్పటికైతే రాజా సాబ్ ముందు ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ డిసెంబర్ 5కే కట్టుబడి ఉంది. అభిమానులు, తెలుగు రాష్ట్రాల బయ్యర్లు సంక్రాంతి అడుగుతున్నారు కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇటీవలే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు విడుదల లాక్ చేసుకున్న రణ్వీర్ సింగ్ దురంధర్ మీద రాజా సాబ్ దెబ్బ పడుతోందని ముంబై వర్గాల టాక్. ఒకే రోజు ప్రభాస్ తో క్లాష్ అవ్వడం వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తింటాయని, దాని బదులు వాయిదా లేదా ప్రీ పోన్ చేసుకోమని నార్త్ డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్నారట.
పైగా దురంధర్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా బాలన్స్ ఉందట. నవంబర్ మూడో వారానికంతా మొత్తం పూర్తి కాకపోవచ్చని అంటున్నారు. వాయిదా తప్పని పక్షంలో మార్చ్ ఆప్షన్ వైపు చూస్తున్నారని సమాచారం. ఒకవేళ లవ్ అండ్ వార్, టాక్సిక్ లో ఏదైనా ఒకటి తప్పుకునే పక్షంలో దురంధర్ ఆ స్లాట్ ని తీసుకునేందుకు సిద్ధంగా ఉందట. ప్రస్తుతానికి అనౌన్స్ మెంట్లు గట్రా ఇవ్వకుండా ఇంకొద్ది రోజులు వేచి చూసే ధోరణిలో ఉండబోతున్నట్టు తెలిసింది. ట్రైలర్ వచ్చాక దురంధర్ మీద అంచనాలు పెరిగాయి. మంచి వయొలెంట్ కంటెంట్ తో యానిమల్ రేంజ్ లో ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభాస్ ప్రభావం బాలీవుడ్ వర్గాల్లో ఏ స్థాయిలో ఉందనేది. తన రిలీజ్ డేట్ ని బట్టి క్లాష్ కావాలా వద్దానేది నిర్ణయించుకుంటున్నారు. ది రాజా సాబ్ మీద హిందీలో చాలా క్రేజ్ ఉంది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ట్రెండ్ గా మారిన హారర్ జానర్ ని డార్లింగ్ చేయడంతో బిజినెస్ పరంగా డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విడుదల తేదీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దురంధర్ కూడా అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది. రాజా సాబ్ గురించి వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో దురంధర్ బృందం అప్రమత్తమై అప్డేట్స్ ఇవ్వకుండా ఆగుతోంది.
This post was last modified on August 9, 2025 9:25 am
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…