ఇంకో పదమూడు రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు రానుంది. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరుని చూసి చాలా గ్యాప్ వచ్చేయడంతో ఫ్యాన్స్ స్పెషల్ ట్రీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడి నిన్న మెగా 157 గురించి హింట్ ఇచ్చేశాడు. అందరూ అనుకుంటున్నట్టు టీజర్ కాదట. టైటిల్ ని రివీల్ చేస్తూ ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేస్తారని సమాచారం. అసలైన విశ్వంభర నుంచి టీజర్ లాంటిది ఎక్స్ పెక్ట్ చేస్తున్న అభిమానుల అంచనాలకు తగ్గట్టు ప్రమోషనల్ కంటెంట్ సిద్ధం చేయడంలో దర్శకుడు వశిష్ఠ బిజీగా ఉన్నట్టు తెలిసింది. అయితే అది ట్రైలర్ రూపంలో ఉంటుందా లేదానేది డౌటే.
వీటితో పాటు వాల్తేరు వీరయ్య కాంబోని రిపీట్ చేస్తూ దర్శకుడు బాబీతో చిరంజీవి చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ అఫీషియల్ గా రానుంది. అదే రోజు ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. టాక్సిక్, జన నాయాగన్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ తీస్తున్న మొదటి టాలీవుడ్ సినిమా ఇది. బడ్జెట్ భారీగా పెట్టబోతున్నారు. ఇవి కాకుండా పెద్ది టీమ్ నుంచి చిరుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ బుచ్చిబాబు ఒక స్పెషల్ పోస్టర్ చేయించినట్టు తెలిసింది. స్టాలిన్ రీ రిలీజ్ ని పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు ఏపీ తెలంగాణ మెగాభిమానులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నిర్మాణంలో ఉన్న ఇతర సినిమాల టీముల నుంచి విషెస్, సెలబ్రిటీల వ్యక్తిగత హ్యాండిల్స్ నుంచి శుభాకాంక్షలు ఎలాగూ పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. సీనియర్ హీరోల్లో సక్సెస్ పరంగా చిరు ఈ మధ్య కొంత వెనుకబడ్డ మాట వాస్తవం. బాలయ్య నాలుగు బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతుండగా చిరంజీవి సినిమాలకు మాత్రం ఏవో ఒక్క అడ్డంకులు ఏర్పడుతునే ఉన్నాయి. విశ్వంభర వాయిదా కన్నా వేరే ఉదాహరణ అక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఇకపై బాస్ స్పీడ్ వేరే లెవెల్ లో ఉంటుందని, వింటేజ్ చిరుని చూడొచ్చని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎగ్జైట్ మెంట్ కి సమాధానం రెండు వారాల్లో దొరకనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates