హిందీ టీవీ సీరియళ్లు, షోలు చూసేవాళ్లకు గౌతమి కపూర్ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీఐడీ సహా పలు సీరియళ్లలో ఆమె నటించింది. హాట్ స్టార్‌లో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్‌లో కేకే మీనన్ భార్య పాత్రలోనూ గౌతమి మంచి గుర్తింపే సంపాదించింది. గౌతమి పలు చిత్రాల్లోనూ క్యారెక్టర్ రోల్స్ చేసింది. ఆమె భర్త రామ్ కపూర్ కూడా హిందీ సీరియళ్లు, సినిమాలతో బాగానే పాపులర్. నటిగా ఎక్కువగా ట్రెడిషనల్ రోల్సే చేసిన గౌతమి.. తనకున్న ఇమేజ్‌కు భిన్నంగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో గౌతమి ఏమందంటే..?
తన కూతురు 16వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా తనతో జరిగిన సంభాషణ గురించి గౌతమి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె ఆ వయసుకు రాగానే తనకు ఏం గిఫ్ట్ ఇద్దామా అని ఆలోచించానని.. ఆ క్రమంలో సెక్స్ టాయ్స్ ఏం కావాలి అని తెలుసుకునే ప్రయత్నం చేశానని.. వైబ్రేటర్ గిఫ్ట్‌గా ఇవ్వాలా అని అడిగానని గౌతమి వెల్లడించింది. తన నుంచి ఇది ఊహించని తన కూతురు నీకేమైనా మతిపోయిందా అన్నట్లు చూసిందని.. చాలా ఇబ్బంది పడిందని గౌతమి తెలిపింది. కానీ తన తల్లి ఆ వయసులో తనతో అలా మాట్లాడలేకపోయిందని.. అవసరాలు, ఆనందాల గురించి ఆలోచించలేదని.. తాను అనుభవించలేకపోయిన సంతోషాలను తన కూతురికి ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను ఆమెను ఈ ప్రశ్నలు అడిగినట్లు గౌతమి వెల్లడించింది.
ఐతే తన కూతురు ఆ సమయానికి తనతో కోపంగా వ్యవహరించినప్పటికీ.. ఇంకో మూడేళ్ల తర్వాత తనకు పరిణతి వచ్చి.. తాను అప్పుడలా అడగడం కరెక్టే అని చెప్పిందని గౌతమి వెల్లడించడం గమనార్హం. ఐతే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపాయి. మన సొసైటీ అంత అడ్వాన్స్డ్ అయిపోయిందా.. కూతురితో ఓ తల్లి ఇలాగేనా మాట్లాడేది.. దీని ద్వారా సొసైటీకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటూ గౌతమి మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
This post was last modified on August 9, 2025 7:08 am
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…