Movie News

వార్ 2 ప్రీమియర్ షోలు ఉంటాయా

ఏపీ తెలంగాణలో వార్ 2 స్పెషల్ షోలు తెల్లవారుఝాము నాలుగు గంటల నుంచి వేసేందుకు డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా హిందీలో అంత ఉదయాన్నే ప్రీమియర్లు వేయరు. ముందు రోజు రాత్రి లేదా మహా అయితే మార్నింగ్ ఆరు తర్వాత ఉంటాయి తప్ప వేరే టైమింగ్స్ పెట్టుకోరు. కానీ తెలుగులో అలా కాదు. దేవర, పుష్ప 2కి మిడ్ నైట్ షోలు పడ్డాయి. బ్రహ్మాండంగా వర్కవుట్ చేసుకున్నాయి. ఇదే స్ట్రాటజీ గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లుకు పని చేయలేదు. సరే ఏదైనా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది కనక ఫలితం వచ్చే దాకా ఎదురు చూడాలి.

ఇదిలా ఉండగా వార్ 2 ప్రీమియర్లు వేయడం సేఫా కాదా అనే దాని మీద పంపిణి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంత జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా ఇది హిందీ మూవీ. మనకు డబ్బింగ్ వెర్షనే వస్తుంది. సో బాలీవుడ్ ఫ్లేవర్ తో నిండి ఉంటుంది. నిద్ర పోకుండా అంత చీకటి ఉండగానే ఫ్యాన్స్ వస్తున్న షోల మీద విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. యావరేజ్ ఉన్నా చాలు అసంతృప్తితో ఫ్లాప్ అని రుద్దేస్తున్నారు. గుంటూరు కారం లాంటి సినిమాలకు దీని వల్ల జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువ. అందుకే వార్ 2 విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. పర్మిషన్లైతే అడిగారని వినికిడి.

ఇది కాకుండా యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఎందుకంటే ఉత్తరాది కంటే రెండు మూడు గంటల ముందే దక్షిణాదిలో షోలు వేయడం వల్ల వచ్చే ఫలితాల గురించి ఒక విశ్లేషణ చేసుకోవాలి. అసలే కూలీతో పోటీ ఉంది. వార్ 2 ని ఎంత లేదనుకున్నా తమిళ అభిమానులు టార్గెట్ చేసుకుని తీరతారు. పరస్పరం నెగటివ్ ప్రాపగండాలు చేసుకోవడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. ఇవన్నీ వార్ 2 కాచుకోవాల్సి ఉంటుంది. నేటివిటీ ఫ్యాక్టర్ ఒక్కటే సమస్యగా మారనున్న వార్ 2కి అండగా నిలబడుతోంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే. దేవరలాగా దీన్ని కూడా కాచుకుంటే బ్లాక్ బస్టర్ ఖాతాలో పడినట్టే.

This post was last modified on August 8, 2025 4:51 pm

Share
Show comments
Published by
Kumar
Tags: War 2

Recent Posts

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్…

2 hours ago

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

4 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

6 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

8 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

11 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

12 hours ago