Movie News

అఖండ 2 – ఆల్ డౌట్స్ క్లియర్

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ బాలకృష్ణ – బోయపాటి శీను కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం విడుదల తేదీ గురించి జరుగుతున్న ప్రచారాలకు చెక్ పడిపోయింది. సెప్టెంబర్ 25 థియేటర్లలో అడుగు పెట్టడాన్ని ఖరారు చేస్తూ నిర్మాణ సంస్థ 14 రీల్స్ అధికారికంగా మరోసారి కన్ఫర్మ్ చేసింది. డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య, బోయపాటిల ఫోటోని షేర్ చేసుకుని ఆ గుడ్ న్యూస్ చెప్పేసింది. ఇంకొక్క పాట బాలన్స్ ఉందనే టాక్ నేపథ్యంలో ఈ నెలలోనే దాన్ని షూట్ చేయొచ్చని టాక్. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ తదితర పనులు శరవేగంగా పూర్తి చేసే దిశగా టీమ్ పరుగులు పెడుతోంది.

అసలీ డిస్కషన్స్ కి కారణం ఓజితో క్లాష్ రావడమే. నిజానికి ఈ తేదీని ముందు లాక్ చేసుకుంది అఖండ 2నే. దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటూ ఏదీ మిస్ కాకుండా పక్కాగా పూర్తి చేసుకున్నారు. ఈలోగా ఓజి బరిలోకి రావడంతో ఎవరో ఒకరు తప్పుకుంటారనే ప్రచారం జరిగింది. తన ప్రొడక్షన్ కాకపోయినా ఈ మధ్యే విశ్వప్రసాద్ ఒకటే వస్తుందనే హింట్ ఇచ్చారు. తీరా చూస్తే ఎవరూ వెనక్కు తగ్గేదేలే అనడం పోటీని వేడెక్కిస్తోంది. డిస్ట్రిబ్యూటర్ల కోణంలో చూసుకుంటే ఓపెనింగ్స్ పరంగా బాలయ్య, పవన్ కళ్యాణ్ మధ్య కలెక్షన్లు పంచుకోవాల్సి రావడం నెంబర్లను ప్రభావితం చేస్తుంది.

సో ఓజి వర్సెస్ అఖండ 2 ఖరారైపోయింది. ఇంకో యాభై రోజుల కంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ప్రమోషన్లు వేగవంతం చేయాలి. ఓజి నుంచి ఇప్పటికే మొదటి ఆడియో సింగల్ వచ్చేసింది. అఖండ 2 నే ఇంకా స్టార్ట్ చేయలేదు. రెండు సినిమాలకు తమన్ సంగీతం అందిస్తుండటం గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా పోలికలు వస్తాయి కాబట్టి ఫ్యాన్స్ సంతృప్తి పరచాల్సిన పెద్ద బాధ్యత తన మీద ఉంది. ఎంతలేదన్నా రెండింటి మీద రెండు వందల కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది అంటే డబుల్ గ్రాస్ రావాలి. చూస్తుంటే సెప్టెంబర్ 25 బాక్సాఫీస్ యుద్ధం మహా రసవత్తరంగా ఉండబోతోంది.

This post was last modified on August 8, 2025 2:00 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

4 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

6 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

6 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

8 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

9 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

10 hours ago