వచ్చే నెల సెప్టెంబర్ 5 బాక్సాఫీస్ కు పెద్ద పరీక్షే ఎదురయ్యేలా ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు ప్యాన్ ఇండియా సినిమాలు తలపడటం ఆసక్తి రేపుతోంది. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ‘మిరాయ్’ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని ఇటీవలే నిర్మాత టిజి విశ్వప్రసాద్ కన్ఫర్మ్ చేయడంతో వాయిదా ప్రచారాలకు చెక్ పడిపోయింది. హనుమాన్ తర్వాత చేసిన మూవీ కావడంతో తేజ సజ్జ మార్కెట్ పెరుగుదల దీని మీదే ఆధారపడి ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా నటించడం మరో హైలైట్ కానుంది.
పోస్ట్ పోన్ల పర్వంలో తడిసిన అనుష్క ‘ఘాటీ’ అదే రోజు రానుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత స్వీటీ కనిపిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ లో ఉన్నారు. మొన్నటి దాకా పెద్దగా బజ్ లేదు కానీ ట్రైలర్ తర్వాత దర్శకుడు క్రిష్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ రావడం దాదాపు ఖరారే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రేపో ఎల్లుండో ఇవ్వొచ్చని టాక్. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ లవ్ థ్రిల్లర్ పూర్తిగా రష్మిక ఇమేజ్ మీదే మార్కెట్ అవుతోంది. ఇవి కాకుండా మరో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
శివ కార్తికేయన్ ‘మదరాసి’ మీద క్రమంగా హైప్ పెరిగేలా ఉంది. అమరన్ తర్వాతి మూవీ కావడంతో తెలుగులోనూ బిజినెస్ ఆఫర్లు బాగున్నాయి. మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం మెయిన్ అట్రాక్షన్. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’కి సురేష్ సంస్థ అండగా నిలుస్తోంది. టీజర్ అయితే విషయం ఉందనే సందేశం ఇచ్చింది. ఇలా అందరూ మూకుమ్మడిగా సెప్టెంబర్ 5నే ఎంచుకోవడం ప్రేక్షకులకు ఎక్కువ ఆప్షన్లు ఇస్తుంది కానీ ఓపెనింగ్స్ పరంగా పరస్పరం ప్రభావితం చెందడం ఖాయం. ఎవరో ఒకరు తప్పుకుంటారేమో చూడాలి.
This post was last modified on August 7, 2025 10:31 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…