మంచు లక్ష్మీ ప్రసన్న అచ్చ తెలుగు అమ్మాయే అయినా.. తన భాష, యాస కొంచెం చిత్రంగా ఉంటాయి. చదువు కోసం అమెరికాకు వెళ్లి అక్కడే చాలా ఏళ్లు ఉండి నేటివ్ అమెరికన్ ఇంగ్లిష్ మీద పట్టు సాధించిన లక్ష్మీప్రసన్న.. ఇక్కడికి తిరిగి వచ్చాక కూడా తన మాటల్లో ఆ ప్రభావాన్ని కొనసాగించడంతో వినేవాళ్లకు అదోలా అనిపించింది. తన భాష, యాస మీద ఎప్పట్నుంచో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఐతే దీన్ని మంచు లక్ష్మి సరదాగానే తీసుకుంటూ ఉంటుంది. తన మీద తాను కౌంటర్లు వేసుకోవడానికి కూడా వెనుకాడదు. అలాగే ఇండస్ట్రీ జనాలు కూడా తనను ఈ విషయంలో ఆట పట్టిస్తుంటారు. లక్ష్మి అందుకు ఏమీ ఫీల్ కాదు. తాజాగా అల్లు అర్జున్ ముద్దుల తనయురాలు అల్లు అర్హ.. మంచు లక్ష్మి మీద కౌంటర్ వేయడం విశేషం. సందర్భం ఏంటో కానీ.. బన్నీ ఇంటికి వెళ్లిన మంచు లక్ష్మి, అల్లు అర్హతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. బన్నీనే ఆ వీడియోను రికార్డ్ చేయడం విశేషం.
అందులో అల్లు అర్హ.. మంచు లక్ష్మిని ఉద్దేశించి నువ్వు తెలుగేనా అని అడిగింది. నేను తెలుగే, నీతో తెలుగులోనే కదా మాట్లాడుతున్నా.. ఎందుకు అలా అడిగావు అని మంచు లక్ష్మి ప్రశ్నిస్తే.. నీ యాక్సెంట్ ఎందుకు అలా ఉంది అంటూ కౌంటర్ వేసింది అర్హ. మరి నీ యాక్సెంట్ కూడా నాలాగే ఉంది కదా అంటూ.. మంచు లక్ష్మి అర్హను అడిగితే తను నవ్వేసింది. బన్నీ కూడా గట్టిగా నవ్వాడు వీళ్లిద్దరి సంభాషణ చూసి. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on August 7, 2025 6:30 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…