హీరో లేదా దర్శకుడు లేదా నిర్మాత.. ఇలా ఎవ్వరైనా సరే ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారంటే వాళ్ల పిల్లలు కూడా సినిమాల్లోకి రావాల్సిందే. ఒకప్పుడు తమ పిల్లల్ని సినిమాల్లోకి తేవాలా వద్దా.. ప్రేక్షకులు ఆమోదిస్తారా లేదా అని కొంచెం సంకోచించేవారు కానీ.. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. అన్ని క్రాఫ్ట్స్ వాళ్లూ వారసులను సినీ రంగంలోకి తెచ్చేస్తున్నారు. అమ్మాయిలు సైతం ఈజీగా సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. ఇక అబ్బాయిలు అయితే హీరోలు అయిపోవాల్సిందే. కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ ఇప్పటికే తన కూతురు అదితిని హీరోయిన్ని చేశారు.
ఆ అమ్మాయి తమిళంలో కథానాయికగా మంచి పేరే సంపాదించింది. కొన్ని హిట్లు కూడా ఖాతాలో వేసుకుంది. ఈ మధ్యే ‘భైరవం’ సినిమాతో టాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టింది. ఐతే శంకర్‌కు ఓ కొడుకు కూడా ఉన్న సంగతి సామాన్య జనానికి పెద్దగా తెలియదు. ఇప్పుడు అతను కూడా హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. తన పేరు అర్జిత్ శంకర్.
అర్జిత్ ఇప్పటికే సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. సీనియర్ దర్శకుడు మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సంగతి తెలిసిన వాళ్లు అతను తండ్రి బాటలో దర్శకుడు అవుతాడేమో అనుకున్నారు. కానీ సినిమాకు సంబంధించి అన్ని విషయాలూ తెలుసుకోవడం కోసమే అతను ఏడీగా పని చేశాడు. తన లక్ష్యం హీరో కావడమేనట.
ముందు ప్రభుదేవా దర్శకత్వంలో అర్జిత్ ఎంట్రీ అని వార్తలు వచ్చాయి కానీ.. అది నిజం కాదట. స్టార్ డైరెక్టర్ అట్లీ దగ్గర పని చేసిన ఓ కొత్త దర్శకుడితో అర్జిత్ జట్టు కట్టబోతున్నాడట. అట్లీ శంకర్ దగ్గరే శిష్యరికం చేయడం విశేషం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. అర్జిత్ ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలోకి వచ్చాయి. లుక్స్ బాగానే ఉన్నాయి. మంచి కథతో హీరోగా షైన్ అవ్వడానికి అవకాశముంది. ఐతే తన పిల్లలు ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి శంకర్ మాత్రం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుండడమే విచారించాల్సిన విషయం.
This post was last modified on August 7, 2025 6:21 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…