విజయ్ దేవరకొండ ఇలా స్టార్ ఇమేజ్ సంపాదించాడో లేదో.. అలా అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండకు కూడా హీరో వేషాలపై ఆశ పుట్టేసింది. హడావుడిగా హీరో అయిపోయాడు. ‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా అతను ఆశించిన ఫలితాన్ని మాత్రం అందించలేదు. ‘దొరసాని’ వచ్చింది వెళ్లింది కూడా తెలియని పరిస్థితి. ఈ సినిమా ఫ్లాప్ కావడం ఒక ఇబ్బందైతే.. ఇందులో విజయ్ లుక్స్, నటన మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడం మరో సమస్య.
ఐతేనేం ఆనంద్‌కు అవకాశాలకేమీ లోటు లేకపోయింది. ఒకటికి మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. అందులో ఒకటి పూర్తి చేసి విడుదలకు కూడా సిద్ధం చేశాడు. అదే.. మిడిల్ క్లాస్ మెలోడీస్. కరోనా ఈ చిత్రానికి వరంలా మారిందనే చెప్పాలి. ఆనంద్ రెండో సినిమా థియేటర్లలో రిలీజైతే జనాలు ఏమాత్రం పట్టించుకునేవాళ్లన్నది సందేహమే. ఈ రోజుల్లో టాక్ ఎలా ఉన్నా హీరో స్థాయిని బట్టే జనాలు థియేటర్లు వెళ్తున్నారు. చిన్న సినిమాలు థియేటర్లలో ఆడటం చాలా చాలా కష్టమైపోతోంది.
ఐతే కరోనా కారణంగా థియేటర్లు మూతపడి ఉండటంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ఆనంద్ కొత్త సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ కూడా అమేజాన్ ప్రైమ్‌లో వచ్చేస్తోంది. గురువారం మిడ్ నైట్ నుంచే ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఆనంద్ తొలి సినిమాతో పోలిస్తే ఈ చిత్రం ప్రామిసింగ్‌గా, పాజిటివ్‌గా కనిపిస్తోంది. మంచి ఎంటర్టైనర్‌లా కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌తో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. కోటికి పైగా ఆ ట్రైలర్‌కు వ్యూస్ రావడం విశేషం.
చిన్న సినిమాలు బాగున్నా థియేటర్లకు వెళ్లి జనాలు చూడ్డం కష్టం. కానీ ఓటీటీలో మంచి టాక్ వస్తే జనాలు బాగానే చూస్తారు. ఓ మోస్తరుగా అనిపించే సినిమాలకు కూడా వ్యూస్ బాగానే వస్తున్నాయి. ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కలర్ ఫోటో’ లాంటి సినిమాలకు వచ్చిన స్పందనే అందుకు నిదర్శనం. కాబట్టి ఈసారి ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మీద ఉన్న పాజిటివిటీకి సినిమా పర్వాలేదు అనిపించినా ఆనంద్ గట్టెక్కినట్లే.
This post was last modified on November 19, 2020 7:37 pm
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…