Movie News

గొడవ తప్పదని తెలిసినా అక్కడే ట్రైలర్ లాంచ్

బాలీవుడ్లో మోస్ట్ కాంట్రవర్శల్ డైరెక్టర్లలో వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఒకరు. కొన్నేళ్ల ముందు వరకు ఈ దర్శకుడికి పెద్దగా పేరు లేదు. ఐతే 2022లో ‘కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా తీసి సంచలనం రేపాడు. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో సాగే ఈ సినిమా తీవ్ర వివాదం రేపింది. అదే సమయంలో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకుంది. కొందరు కశ్మీర్ పండిట్ల దీన గాథలను అద్భుతంగా చూపించారంటూ వివేక్ మీద ప్రశంసలు కురిపిస్తే.. ముస్లింల మీద ద్వేషాన్ని పెంచేలా తీసిన ప్రాపగండా మూవీ ఇదంటూ ఈ చిత్రాన్ని దుయ్యబట్టారు. వివేక్ విమర్శలను పట్టించుకోకుండా ఈ సక్సెస్‌ను మాత్రమే తీసుకుని.. ఆ తర్వాత కూడా ఈ తరహా సినిమాలే తీయడంలో నిమగ్నమయ్యాడు. 

‘వ్యాక్సిన్ వార్’ సినిమా వివేక్‌కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా.. ఇప్పుడు ‘బెంగాల్ ఫైల్స్’ మూవీతో రెడీ అయ్యాడు. 1947లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన మతపరమైన దాడుల నేపథ్యంలో సాగే సినిమా ఇది. దీని టీజర్ లాంచ్ కాగానే దుమారం రేగింది. బెంగాల్‌‌కు చెందిన అనేకమంది రాజకీయ నాయకులు వివేక్ మీద విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అధికార టీఎంసీ పార్టీ వాళ్లు వివేక్‌ను టార్గెట్ చేశారు. ఇక్కడ మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఆ రాష్ట్రంలో పదుల సంఖ్యలో వివేక్ మీద కేసులు నమోదయ్యాయి. ఈ సినిమాను తమ రాష్ట్రంలో రిలీజ్ చేయనివ్వమని.. వివేక్ ఇక్కడికి వస్తే అతడి అంతు చూస్తామని వార్నింగ్‌లు ఇచ్చారు. 

ఐతే ఇంత వివాదం చెలరేగాక.. తాను పశ్చిమ బెంగాల్‌ను బెంగాల్‌కు వెళ్తే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని తెలిసి కూడా వివేక్ అగ్నిహోత్రి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్‌లోనే ‘బెంగాల్ ఫైల్స్’ ట్రైలర్ లాంచ్ చేస్తానని.. అక్కడ తనను ఎవరు ఆపుతారో చూస్తానని వివేక్ అన్నాడు. అంతే కాక ‘బెంగాల్ ఫైల్స్’ సినిమాను బెంగాల్‌లో రిలీజ్ చేసి తీరుతానని కూడా ఆయన తేల్చి చెప్పారు. సెప్టెంబరు 5న ‘బెంగాల్ ఫైల్స్’ రిలీజ్ కావాల్సి ఉండగా.. నిజంగానే వివేక్ కోల్‌కతాకు వెళ్లి ట్రైలర్ లాంచ్ చేయాలనుకుంటే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఖాయం. అలాగే ఈ సినిమా రిలీజ్ టైంలో కూడా అక్కడ పరిస్థితులు అదుపు తప్పుతాయని భావిస్తున్నారు.

This post was last modified on August 7, 2025 6:15 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

2 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

5 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

5 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

7 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

8 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

9 hours ago