Movie News

పెద్దన్న… ఆ కాంబినేషన్ వద్దన్నా !

మీరు హెడ్డింగ్ లో చూస్తున్న స్టేట్ మెంట్ రజనీకాంత్ అభిమానుల నుంచి వినిపిస్తోంది. కూలీ తర్వాత జైలర్ 2 ఉన్న సంగతి తెలిసిందే. ఇవయ్యాక ఏ దర్శకుడితో చేస్తాడనే దాని మీద చెన్నై వర్గాల్లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కానీ సిరుతై శివ చెప్పిన కథకు తలైవర్ సానుకూలంగా స్పందించారనే టాక్ ఒకటి ఫ్యాన్స్ లో టెన్షన్ రేపుతోంది. ఇంతకు తన కలయికలో రజని అన్నాతే (పెద్దన్న) చేశారు. మితిమీరిన సిస్టర్ సెంటిమెంట్ డ్రామాతో శివ డిజాస్టర్ ఇచ్చారు. తమిళంలో కొంత ఓకే కానీ తెలుగు లాంటి ఇతర భాషల్లో కనీస వసూళ్లు రానంత దారుణమైన తిరస్కారానికి గురయ్యింది.

సరే ఇలాంటి ఫ్లాపులు ఏ దర్శకుడికైనా కామన్ అనుకోవచ్చు. నాలుగు సంవత్సరాల టైం తీసుకుని సూర్యతో ఆయన తీసిన ప్యాన్ ఇండియా కళాఖండం గురించి మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. కంగువ అంటే చాలు మూవీ లవర్స్ ఇప్పుడు కూడా ఖంగు తింటారు. రెండేళ్ల సూర్య విలువైన సమయాన్ని వృథా చేశాడని సూర్య అభిమానులు ఇప్పటికీ ఫీలవుతూ ఉంటారు. ఇదంతా జరిగి సుమారు ఏడాది కావొస్తోంది. ఈలోగ శివ పలుమార్లు రజనీకాంత్ ని కలుసుకోవడం, స్టోరీ లైన్ చెప్పి ఇంప్రెస్ చేయడం జరిగిపోయాయట. కాకపోతే ఫైనల్ వెర్షన్ విన్నాకే గ్రీన్ సిగ్నల్  ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

ఇది నిజం కాకూడదని ఫ్యాన్స్ కోరిక. అయినా సీనియర్ హీరోలు ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ఒకసారి ఫిక్స్ అయితే మొండిగా ముందుకు వెళ్లిపోతున్నారు. చిరంజీవి భోళా శంకర్ అలా వచ్చిందే. కాకపోతే రజనీకాంత్ కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తూ కొత్త జనరేషన్ డైరెక్టర్లతోనే చేతులు కలుపుతున్నారు. జైలర్ తర్వాత వెట్టయన్, లాల్ సలామ్ నిరాశ పరిచినప్పటికీ కూలి మళ్ళీ సూపర్ స్టార్ పవర్ చూపిస్తుందని కోలీవుడ్ నమ్మకంగా ఉంది. ముఖ్యంగా వెయ్యి కోట్ల గ్రాసర్ అవుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఏడు పదుల వయసులో రజనీకాంత్ సెలక్షన్ అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే.

This post was last modified on August 7, 2025 2:51 pm

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

24 minutes ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

4 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

6 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

6 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

7 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

8 hours ago