ఇంకో ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న వార్ 2 ప్రమోషన్ల పరంగా కూలి కన్నా వెనుకబడి ఉండటాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫీలవుతున్న వైనం స్పష్టం. హైదరాబాద్ లో ఆగస్ట్ 10 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగొచ్చనే ప్రచారం ఉంది కానీ అనుమతుల కోసం నిర్మాణ సంస్థ ఎదురు చూస్తోంది. అవి రాగానే ఏర్పాట్లు వేగవంతం చేస్తారు. వార్ 2 ఫైనల్ వెర్షన్ ని 2 గంటల 53 నిమిషాలకు లాక్ చేయడం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన స్పై మూవీస్ అన్నింటిలో ఇదే అత్యంత పెద్దది. వార్ మొదటి భాగం 2 గంటల 34 నిమిషాలే ఉంటుంది. సీక్వెల్ పది నిముషాలు అదనం.
మాములుగా ఉత్తరాది మల్టీప్లెక్సులు ఎక్కువ నిడివిని ఇష్టపడవు. ఖర్చులు తగ్గించుకోవడం కోసం రెండున్నర గంటలు లేదా అంతకన్నా గరిష్టంగా ఒక పావు గంట ఎక్కువ ఉంటే చాలనుకుంటారు. యష్ రాజ్ అధినేత ఆదిత్య చోప్రా సైతం ఇదే అభిప్రాయంతో ఉంటారు. యాక్షన్ మూవీస్ ని పరుగులు పెట్టించాల్సి తప్పించి లెన్త్ పెంచకూడదనేది ఆయన పాలసీ. కానీ వార్ 2 విషయంలో అది పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒక ఇరవై నిముషాలు ట్రిమ్ చేసే అవకాశం ఉంటే చూడమని దర్శకుడు అయాన్ ముఖర్జీకి చెప్పినా, అలా చేస్తే ఒక హీరోకి ప్రాధాన్యం తగ్గుతుందని భావించి నో చెప్పారని ముంబై టాక్.
సో స్పై సిరీస్ లో అతి పెద్ద మూవీ వార్ 2 కానుంది. ఇప్పటికైతే అడ్వాన్స్ బుకింగ్స్, అంచనాలు, హైప్, ఆడియో విషయంలో కూలినే ముందంజలో ఉన్నప్పటికీ థియేటర్ లో కంటెంట్ చూశాక తారక్, హృతిక్ ఫాన్స్ సర్ప్రైజ్ అవుతారని టీమ్ చెబుతోంది. దేవర తర్వాత పదకొండు నెలల గ్యాప్ తెచ్చిన తారక్ కోసం అభిమానులు ఘనంగా స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. హృతిక్ రోషన్ మరో హీరో అయినప్పటికీ, వార్ 2 డబ్బింగ్ మూవీగానే రిలీజవుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం స్ట్రెయిట్ సినిమా రేంజ్ లో హడావిడి చేయబోతున్నారు. తెల్లవారుఝామున స్పెషల్ ప్రీమియర్లతో వార్ 2 ఓపెన్ కానుంది.
This post was last modified on August 7, 2025 1:08 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…