Movie News

కన్నడ దర్శకుడితో మాస్ రాజా?

తెలుగులో ఒక చిత్రానికి, ఇంకో చిత్రానికి పెద్దగా గ్యాప్ లేకుండా.. చాలా వేగంగా సినిమాలు చేసుకుపోయే స్టార్ హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకరు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన స్పీడు చూపిస్తుంటారు. ఒక సినిమా పూర్తయ్యేలోపు ఇంకో సినిమాకు అన్నీ రెడీ చేసుకుని.. ఇది అవ్వగానే దాని మీదికి వెళ్లిపోతుంటారాయన. కొన్ని సందర్భాల్లో ఒకేసారి రెండు సినిమాల్లోనూ నటిస్తుంటారు మాస్ రాజా. ప్రస్తుతం ఆయన ‘మాస్ జాతర’ సినిమాను పూర్తి చేయనున్నారు.

ఇది చివరి దశలో ఉండగానే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రవితేజ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అది కూడా దాదాపు సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు రవితేజ చేయబోయే మరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి మాస్ రాజా ఓ కన్నడ దర్శకుడితో జట్టు కట్టబోతుండడం విశేషం. తన పేరు.. ఏపీ అర్జున్. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడైన ధ్రువ్ సర్జాతో ‘మార్టిన్’ సినిమా తీసిన దర్శకుడు.. ఏపీ అర్జున్.

పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ‘మార్టిన్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మాస్ పేరుతో మరీ క్రింజ్ సీన్లు తీశారంటూ ట్రోలింగ్ కూడా జరిగింది ఆ సినిమా రిలీజ్ టైంలో. కాకపోతే మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా అర్జున్‌కు పేరొచ్చింది.

రవితేజ అంటేనే మాస్ అన్న సంగతి తెలిసిందే. అందుకే అర్జున్‌తో తన ఇమేజ్‌కు సరిపోయే సినిమా చేయడానికి రవితేజ రెడీ అయినట్లున్నాడు. బెంగళూరుకు చెందిన ఒక కార్పొరేట్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోందట. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో చేయాలని కూడా చూస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక ‘మాస్ జాతర’ సినిమా ఈ నెల 27నే రిలీజ్ కావాల్సి ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాను వచ్చే సంక్రాంతికి అనుకుంటున్నారు.

This post was last modified on August 6, 2025 5:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నందమూరి హీరోలకు నెంబర్ 2 గండం

అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…

1 hour ago

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్…

3 hours ago

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

6 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

8 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

10 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

13 hours ago