ఒక హీరో హీరోయిన్ తరచుగా కలిసి కనిపిస్తే.. వాళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైపోతుంది. అందులోనూ ఆ ఇద్దరిలో ఎవరైనా.. అవతలి వాళ్ల కుటుంబ సభ్యులతో అసోసియేట్ అయ్యారంటే ఈ ప్రచారం మరింత ఊపందుకుంటుంది. ఇప్పుడు తమిళ నటుడు ధనుష్, బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్‌ల గురించి ఇలాగే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా జనాలు. బాలీవుడ్ మీడియాలో కూడా వీరి బంధం గురించి వార్తలు వస్తున్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ తనయురాలు ఐశ్వర్యను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ధనుష్.. రెండేళ్ల కిందట ఆమె నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.
వీళ్లిద్దరికీ అధికారికంగా విడాకులు వచ్చాయా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ.. చాలా కాలంగా విడివిడిగానే ఉంటున్న మాట వాస్తవం. కాగా మృణాల్‌కు 33 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటిదాకా సినిమా చేయకపోయినా.. వీరి మధ్య రిలేషన్‌షిప్ మొదలైందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మృణాల్ నటించిన ‘సన్నాఫ్ సర్దార్-2’ సినిమాకు ముంబయిలో ప్రిమియర్ వేయగా.. దానికి ధనుష్ హాజరవడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ప్రివ్యూ సందర్భంగా ధనుష్, మృణాల్ చాలా సన్నిహితంగా కనిపించారు. ఇద్దరి కెమిస్ట్రీ చూసి వీరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇద్దరూ కలిసి సినిమా చేయకపోయినా.. ఎలా కలిశారు, ఎలా బంధం మొదలైంది అన్నది తెలియదు. ఐతే ధనుష్‌తో పాటు అతడి ఇద్దరు సిస్టర్స్‌ను మృణాల్ సోషల్ మీడియాలో ఫాలో అవుతోంది. ఇటీవల మృణాల్.. ధనుష్ కుటుంబాన్ని కూడా కలిసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తుండొచ్చు అనే ప్రచారం ఊపందుకుంది. మరి ఈ వార్తల మీద ధనుష్, మృణాల్ స్పందిస్తారేమో చూడాలి.
This post was last modified on August 6, 2025 5:45 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…