టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాలు విడుదల తేదీ విషయంలో ఖచ్చితంగా మాట మీద ఉండలేని పరిస్థితులు ప్రస్తుతం చూస్తున్నాం. షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఫైనల్ కాపీ చేతికి వచ్చేదాకా రిలీజ్ డేట్ ఖచ్చితంగా ఇదని ఎవరూ చెప్పలేకపోతున్నారు. వాయిదాల పర్వం అతి మాములు విషయమైపోయింది. టయర్ 2 హీరోలకు సైతం ఈ చిక్కు తప్పడం లేదు. అలాంటిది ఇక స్టార్ల గురించి చెప్పదేముంది. ది రాజా సాబ్ డిసెంబర్ 5 విడుదల ఖాయమని ఆ మధ్య టీజర్ లాంచ్ లో టీమ్ బలంగా చెప్పడం చూశాం. పుష్ప 2, యానిమల్ తరహాలో ఇయర్ ఎండింగ్ విధ్వంసం చూడొచ్చని ఫ్యాన్స్ భావించారు.
కానీ ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పునరాలోచనలో పడింది. ఏపీ తెలంగాణ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సంక్రాంతి బెటరని అభిప్రాయపడుతున్నారట. జనవరి 9 లాక్ చేయమని అడుగుతున్నారని ఇప్పటికే టాక్ ఉంది. కానీ పండక్కు చాలా తీవ్రమైన పోటీ ఉంది. విజయ్ జన నాయకుడు, రవితేజ – కిషోర్ తిరుమల మూవీ, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో పాటు చిరంజీవి రావిపూడి మెగా 157 రేసులో ఉన్నాయి. రాజా సాబ్ వస్తోందని వీటిలో ఒకటో రెండో తప్పుకోవచ్చు కానీ మిగిలినవి అలాగే ఉంటాయి. ఇది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించే అంశమే. ప్రభాస్ వస్తున్నాడని అందరూ వాయిదా వేసుకోరు.
అయితే బాలీవుడ్ వర్గాలు డిసెంబర్ 5నే కోరుకుంటున్నాయి. ఎందుకంటే పుష్ప 2, యానిమల్ భారీ రెవిన్యూని సాధించింది ఈ నెలలోనే. పైగా రణ్వీర్ సింగ్ దురంధర్ మీదున్న బజ్ తో పోలిస్తే రాజా సాబ్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ట్రైలర్ చూశాక ఆ నమ్మకం మరింత పెరిగింది. అసలే నార్త్ ఆడియన్స్ కు హారర్ ఫీవర్ పట్టుకుంది. స్త్రీ 2, భూల్ భులాయ్యా 3, ముంజ్య, షైతాన్ లాంటి హిట్లు చూశాక ట్రేడ్ సైతం వీటి మీద ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు. అలాంటిది ఈ జానర్ లో ప్రభాస్ అడుగు పెడితే ఇంకేమైనా ఉందా. సో ఫైనల్ గా రాజా సాబ్ దేనికి ఫిక్స్ అవుతాడో కొద్దిరోజులు ఆగితే తప్ప క్లారిటీ రాదు.
This post was last modified on August 6, 2025 11:15 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…